30 మంది చెన్నై లేడీస్ అరెస్టు... రీజనే సర్ ప్రైజ్

August 03, 2020

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో తమిళనాడులో కొద్ది రోజులుగా పోలీసులు ఒక కొత్త కార్యక్రమానికి తెర తీశారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోల్ని అదే పనిగా రోజూ చూసే వారిని గుర్తించటం స్టార్ట్ చేశారు. దీని కోసం అత్యాధునిక సాంకేతికను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆ మధ్యన మూడువేల మందిని గుర్తించిన పోలీసులు వారిని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ కౌన్సెలింగ్ ఇచ్చారు.
మొదటి తప్పు కింద వదిలేస్తున్నామని.. తీరు మార్చుకోకపోతే ఏడేళ్లు జైలుశిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. తమిళనాడు రాష్ట్రం మొత్తమ్మీదా అశ్లీల వీడియోలు చూసే వారిని తాము గుర్తిస్తామని.. ప్రతి ఒక్కరి అశ్లీల వీడియోలు చూసే వారి కదలికలను ట్రాక్ చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొనటం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏడీజీపీ రవి చేసిన ప్రకటన మరింత షాకింగ్ గా మారింది.
అశ్లీల వీడియోల్ని అదే పనిగా చూసే వారిలో 30 మంది మహిళల్ని తాము గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ వీడియోల్ని ఎక్కువగా పురుషులే చూసేవారని.. ఇప్పుడు మహిళలు.. యువతులు.. పిల్లలు కూడా చూస్తున్నారన్నారు.  అదే పనిగా అశ్లీల వీడియోల్నిచూసే 30 మంది మహిళలు చెన్నైనగరానికి చెందిన వారుగా ఆయన పేర్కొన్నారు. సో.. చెన్నైలో ఉంటే ఆ వీడియోలు చూస్తే.. పోలీసులకు దొరికిపోవటం ఖాయం సుమా.