బాలయ్య వర్సెస్ చిరు - పోసాని ఏమన్నారంటే

August 14, 2020

లాక్ డౌన్లో ప్రశాంతంగా ఉన్న ఇండస్ట్రీని బాలయ్య  నాగబాబు కలిసి ఓ కుదుపు కుదిపారు. సినిమా పరిశ్రమ లో సరికొత్త లుకలుకలు బయటపడ్డాయి. ప్రముఖ నటుడు అయిన బాలకృష్ణను ను పిలకుండా సమావేశం పెట్టినపుడు ప్రశ్నించని నాగబాబు... సమావేశానికి పిలవలేదని బాలకృష్ణ చేసిన కామెంట్లపై అనవసర ఆవేశాలకు పోయి రచ్చర్చ చేశారు. ఇపుడు మరి ఫ్యామిలీ మొత్తం క్లాస్ పీకిందో ఏమో సైలెంటుగా ఉన్నారు. కానీ గొడవ మాత్రం చల్లారలేదు. కొనసాగుతూనే ఉంది. దీనిపై చర్చ సాగుతూనే ఉంది.

తాజాగా ఈ వ్యవహారంపై పోసాని కృష్ణమురళి స్పందించారు. ప్రతిదానికి ఆవేశానికి పోయి స్పందించే పోసాని ఈ వ్యవహారంపై చాలా కూల్ గా మాట్లాడటం విశేషం. పోసాని స్పందన అంటేనే బాలకృష్ణపై విరుచుకుపడి ఉంటారు. ఎందుకంటే ఆయన జగన్ పంచన చేరిన మనిషి కదా అనుకున్నారేమో. కానీ పోసాని పార్టీ మనిషిగా కాకుండా ఇండ స్ట్రీ మనిసిగా మాట్లాడారు. ఇంతకీ పోసాని ఏమన్నారు.

బాలకృష్ణ గురించి : 

బాలయ్యకు కోపం కాస్త ఎక్కువే. కానీ ఆ కోపానికి ఒక కారణం ఉంటుంది.  బాలయ్య ఏదైనా మొఖం మీద మాట్లాడతారు.  ఉన్నది ఉన్నట్టు చెబుతారు. మేకప్ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా స్పందించే మనిషి. అతను చాలా మంచి మనిషి. అవినీతి అక్రమాలు పాల్పడాలనే తత్వం అస్సలుండదు. అన్న నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఎన్టీఆర్ కొడుకులు అందరూ సొంత కష్టం మీద పైకి వచ్చారు. బాలయ్య కూడా అంతే. అతను అందరిని ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు.  

ఇక్కడ పోసాని స్పందనో బాలయ్య అలా అన్నాడంటే నిజమే అయి ఉంటుందని అర్థం వచ్చేలా స్పందించారు పోసాని. అవాస్తవాలు అయితే బాలయ్య మాట్లాడరు అన్నట్టుంది పోసాని స్పందన.

చిరంజీవి గురించి :

చిరంజీవి చాలా మంచివారు.  పరిశ్రమలో అందరినీ తన వారిలా చూసుకుంటారు. ఆయనతో కలిసి ఖైదీ నెం 150 సినిమా చేశాను. ఆయన పాత సినిమా 'అల్లుడా మజాకా' సినిమాకు కథ రాసింది నేనే. అతని వ్యక్తిత్వం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 

చిరంజీవిపై కూడా మచ్చ వేయకుండా పోసాని స్పందించారు. పోసాని వ్యవహారం చూస్తే... పరిశ్రమలో ఈ గొడవ త్వరగా చల్లారాలి అన్న ఉద్దేశంతో చేసినట్టుంది. తప్పు జరిగింది... ఇక మీద జరగకపోతే బాగుండు అనేలా ఉంది పోసాని స్పందన. మంచిదే. పోసాని నుంచి ఇంత కూల్ రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. అందుకే ఇది వైరల్ అవుతోంది.