బాలకృష్ణ కలలు నెరవేరవు - పోసాని స్పందన 

August 12, 2020

పోసాని కృష్ణ మురళి మళ్లీ తెరపైకి వచ్చారు. తనకు సంబంధం ఉన్నవీ, లేనివి అన్నీ మాట్లాడారు. తనకు నచ్చిన వాళ్లను పొగిడారు. తనకు నచ్చని వాళ్లపై విమర్శలు చేశారు. కొన్ని క్లారిటీలు ఇచ్చారు. ఇంకొన్ని సందేహాలు పెట్టారు. అయితే... అన్నింటిలోకి బాలకృష్ణపై ప్రత్యక్షంగా, చంద్రబాబుపై పరోక్షంగా మాట్లాడారు. జగన్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు.

బాలకృష్ణ... మొన్నామధ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఐదేళ్లుండదు అనడం విన్నాను. బాలకృష్ణ గారు మీరు అలాంటి ఆశలేం పెట్టుకోకండి. అక్కడున్నది ఎన్టీఆర్ కాదు.. పొడిపించుకోవడానకిి, ప్రభుత్వం పడిపోవడానికి. సీట్లో ఉన్నది జగన్ గారు. ఆయన ఎవరినీ పొడవరు. ఎవరితోను పొడిపించుకోరు. ఆయన ఇపుడే కాదు, మరో నాలుగేళ్లు అధికారంలో ఉంటారు. ఆ తర్వాత ఐదేళ్లు, ఆ తర్వాత ఇంకో ఐదేళ్లు  కూడా జగనే ముఖ్యమంత్రి అని పోసాని కృష్ణమురళి బల్లగుద్ది చెప్పారు.

ఇక జగన్ గురించి స్పందిస్తూ...  ఏపీ లో ప్రతిపక్ష నేతలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. రైతులకు ఏం ఇబ్బంది లేదని... నీటి వివాదంపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంది. ఇద్దరు కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారన్నారు. కేసీఆర్ చెప్తే జగన్ వింటారు. జగన్ రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇద్దరు సీఎంలు పరిష్కరించుకుని ఇరు ప్రాంతాల రైతులకు నీళ్లిస్తారు అని పోసాని అన్నారు.