హైదరాబాద్ 3 స్టార్ హోటల్ ఫుడ్డే ఆ పిల్లాడ్ని చంపేసిందా?

July 04, 2020

షాకింగ్ ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. అమెరికాకు వెళ్లేందుకు వీసా పని మీద హైదరాబాద్ కు వచ్చిన ఒక కుటుంబం త్రీస్టార్ హోటల్లో బస చేసింది. ఆ నిర్ణయమే వారి రెండేళ్ల బాబు మరణానికి కారణమైందా? అంటే.. అవునన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం మాట ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఆరోపణలు చేసిన విధంగా పోలీసులు ఫిర్యాదు స్వీకరించి.. విచారిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన రవి.. శ్రీవిద్య దంపతులు బెంగళూరులో ఐటీ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వారి వయసు రెండేళ్లు. అమెరికాకు వెళ్లేందుకు వారు వీసాలకు అప్లై చేసుకున్నారు. ఆ పని మీద వారు ఆదివారం హైదరాబాద్ కు వచ్చారు. అమెరికా కాన్సులేట్కు దగ్గరగా ఉన్న హోటల్ లో రూం తీసుకున్నారు. త్రీస్టార్ హోటల్ గా చెప్పే మానస సరోవర్ లో వారు దిగారు.
కాన్సులేట్ లో పని పూర్తి చేసుకొని వచ్చిన వారు.. మధ్యాహ్నం రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నారు. రాత్రి వేళలో బ్రెడ్ బాస్కెట్.. కడాయ్ పన్నీర్ తెప్పించుకు తిన్నారు. డిన్నర్ అయిన కాసేపటికే రవి అతని రెండేళ్ల కుమారుడు వరుణ్ లకు కు తీవ్రమైన కడుపునొప్పికి గురి అయితే.. భార్య శ్రీవిద్య.. మరో చిన్నారి విహాన్ కు వాంతులు అయ్యాయి. దీంతో నగరంలోని బంధువుకు ఫోన్ చేసి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. మంగళవారం ఉదయానికి విహాన్ అపస్మారక స్థితిలోఉన్నాడు. చిన్నారి పెదాలు నల్లగా మారాయి. వెంటనే కిమ్స్ కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు చెప్పటంతో వారు షాక్ తిన్నారు. మిగిలిన ముగ్గురు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. బాధితుల ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు. పిల్లాడి పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ.. ఈ కేసులోని తప్పేమిటన్నది తేలదన్న మాట పోలీసు వర్గాల చెబుతున్నాయి.

Read Also

కరోనా: గవర్నమెంటుకి డాక్టరు బ్లాక్ మెయిల్
గుడికోసం ఎంఐఎం వినతిపత్రం... కథేంటి?
కేసీఆర్ బర్త్ డేకి కేటీఆర్ అడ్వాన్స్ ప్లానింగ్