కేసీఆర్ -జగన్ ల గుట్టు రట్టు చేసేశాడు !

August 14, 2020

పోతిరెడ్డి పాడు లిఫ్ట్: ఆంధ్ర తెలంగాణ జలవివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా చక్కగా రక్తి కట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వారిద్దరిదీ లోపల స్నేహం బయట గొడవ అని... దానికి ‘సాక్షి’, ’నమస్తే తెలంగాణ’ పత్రికలే సాక్షి అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. వారి జలవివాదాలు కేవలం స్వీయ లబ్ధి కోసం సృష్టించినవే అని ఎంపీ రేవంత్ రెడ్డి వారిద్దరి గుట్టును రట్టుచేశారు.

కేసీఆర్ ఫిర్యాదు చేసినట్టు నటిస్తాడు, తెలంగాణ ప్రజలు జగన్ మీద అరుస్తారు. నమస్తే తెలంగాణలో మాత్రం ఆ వార్తను మూడో పేజీలో పడేస్తారు. అదే వార్త సాక్షి (తెలంగాణ ఎడిషన్) మొదటి పేజీలో వస్తుంది. ఆంధ్రాకు పోతే... మా నీళ్లే మేము తీసుకుంటున్నాం అని జగన్ అంటాడు. అక్కడ జగన్ వార్త మొదటి పేజీలో వేస్తుంది. ఇదంతా గూడుపుఠాని మినహా మరేం కాదు.

వీరి అసమర్థతను దాచిపెట్టుకోవడానికి ఉమ్మడిగా ఆడుతున్న నాటకమే జలయుద్ధం అని రేవంత్ విమర్శించారు. ఇది జలయుద్ధం కాదని, జగన్నాటకం అని రేవంత్ రెడ్డి విమర్శించారు. మీడియాలు వీరిని బెదిరించలేకపోవచ్చు గానీ మీ నాటకాలను సోషల్ మీడియా బయటపెడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. 

రేవంత్ ససాక్ష్యాలతో నిరూపించిన వీడియో :

 

రేవంత్ రెడ్డి... తెలంగాణ వెర్షను పక్కన పెడితే... ఎన్నికల ముందు ప్రాజెక్టు ప్రతిపాదనే గాని... జగన్ ఆ ప్రాజెక్టు కట్టేదీ లేదు, రాయలసీమకు నీరిచ్చేదీ లేదు. జగన్ నియోజకవర్గం పులివెందులతో సహా చిత్తూరు వరకు ఇప్పటికే చంద్రబాబు కృష్ణా నీటిని తీసుకెళ్లారు అని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. దీన్ని రైతులు 2018, 19 సంవత్సరాల్లో పండగలా జరుపుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటికి రాయలసీమలో పరవళ్లు తొక్కిన కృష్ణా జలాల వీడియోలు కావల్సినన్ని దొరుకుతాయని తెలుగుదేశం నేతలు గుర్తుచేశారు.