జగన్ - కేసీఆర్ వ్యూహానికి బీజేపీ బ్రేక్ !

August 06, 2020

సడెన్ గా పోతిరెడ్డి పాడు తెరమీదకు వచ్చింది. ఏడాదిగా లేని ఉత్సాహం ఇపుడు, పైగా క,రో-నా టైంలో ఎందుకు తెరమీదకు వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయేలోపు అది ఇద్దరు ముఖ్యమంత్రుల డైవర్షన్ గేమ్ అని రేవంత్ రెడ్డి వంటి వారు సాక్ష్యాలతో గుట్టు రట్టు చేశారు. అయితే, వీరు తాత్కాలికంగా డ్రామా ఆడదామని చేసిన ప్రయత్నానికి నిజంగానే బ్రేకులు పడ్డాయి. ఏపీకి ఈ నిర్ణయం తీరని నష్టం చేసేలా కనిపిస్తోంది. 

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును తన వాటా పరిధిలో చేపడుతున్నామని జగన్ గాని, నీటి పారుదల మంత్రి అనిల్ యాదవ్ గాని, అధికారులు గాని గట్టిగా వాదన వినిపించకపోవడంతో తెలంగాణ వాదన వైపే కేంద్రం మొగ్గింది. పోతిరెడ్డిపాడు విషయంలో ముందుకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం.

‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో ఇరువురు తీసుకుంటున్న వాటా గురించి ముందుకు పరిశీలిస్తాం. అంతవరకు ప్రాజెక్టుపై ముందుకు పోవద్దని ఆదేశించినట్టు చెప్పిన మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ వ్యవహారంపై డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తీసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును ఆదేశించామన్నారు. ఆ రిపోర్టు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం‘ అన్నారు.

వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఈ అంశంపై కృష్ణా బోర్డు కౌన్సిల్ అత్యవసర సమావేశాలు నిర్వహించవలసినదిగా సూచించాం సూచించినట్లు మంత్రి తెలిపారు. ఇంతకీ మంత్రి ఇంత హడావుడిగా ఈ లేఖ ఎందుకిచ్చారో తెలుసా... తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు రిప్లై ఇస్తూ ఈ విషయాలను వెల్లడించింది.

ఏపీ వాటాను సాధించుకోవడంలో జగన్ అటు కేసీఆర్ ను ఎదిరించలేరు. బీజేపీని కూడా ఎదిరించలేరు. దీంతో ఇక ఏపీ సాగునీటి అవసరాలు ఎలా తీరేనో ఏంటో?