జగనన్నా ఇది విన్నావా?

February 22, 2020

మన తెలుగు రాష్ట్రాల్లో నిత్యం డబ్బులు సంపాదించే ప్రభుత్వ విభాగాలు రెండు... ఒకటి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, రెండోది రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్.  పదుల సంఖ్యలో ప్రభుత్వ శాఖలు ఉన్నా ప్రభుత్వానికి సగం ఆదాయం ఈ రెండింటి నుంచే వస్తుంది. మరి నిత్యం డబ్బులు సంపాదించే ఈ డిపార్ట్ మెంట్లో కేవలం చిల్లర అమౌంట్ లేక పనులు ఆగిపోయాయంటే నమ్ముతారా? మీరు నమ్మకపోయినా ఇది పచ్చి నిజం.

గత ప్రభుత్వ పాలనలో ఏనాడూ జరగని విధంగా జగన్ పరిపాలనలో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కరెంటు బిల్లు కట్టలేక అన్ని రిజిస్ట్రేషన్లు ఆపేసింది. చిత్రం ఏంటంటే... జగన్ అధికారంలోకి వచ్చాక... జులై నుంచి ఇప్పటివరకు ఒక నెల కూడా కరెంటు బిల్లు కట్టకపోయేసరికి ట్రాన్స్ కో వాళ్లు తిరిగి తిరిగి చేసేదేమీ లేక కరెంట్ కట్ చేశారు. మేము కరెంట్ ఇస్తే... మీరు వాడుకుని డబ్బులు సంపాదిస్తారు. మరి మా డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పుకోవాలి అంటూ వారు పవర్ తీసేశారు. 

మా నుంచి గవర్నమెంటు ముక్కు పిండి రోజూ కోట్లు తినేస్తున్న అందులో పది లక్షలు పెట్టి కరెంటు బిల్లు కట్టలేకపోయిందా... ఇదేం దౌర్బాగ్యం అంటూ ప్రజలు పిచ్చితిట్లు తిడుతున్నారు. ఇది ఎంత తెలివి తక్కువ పని అంటే... ఆరు నెలల కరెంటు బిల్లు కంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఒక్క రోజులో వచ్చే ఆదాయం ఎక్కువ. శాశ్వతంగా అలాంటి ఆదాయం వరుసగా రెండు రోజులు పోగొట్టుకుంది గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఇదే వింత పాలనో అర్థం కాక జనం లబోదిబోమంటున్నారు. కరెంటు లేక అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. మరి ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ఎలా పరిష్కరిస్తుందో, ఎపుడు పరిష్కరిస్తుందో మరి?