Prabhas 20 : వైరల్ అవుతున్న పూజ, ప్రభాస్ ఫొటోలు

August 07, 2020

ప్రభాస్ 20వ చిత్రం సందడి మళ్లీ మొదలైంది. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణకుమార్ దర్వకత్వంలో ప్రభాస్ తన 20వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ సన్నివేషాలు షూట్ జరుగుతుండగా... కరోనా వల్ల ఆగిపోయింది. జార్జియాలో ఈ సినిమా చివరి సన్నివేషాల షూట్ జరుగుతుండగానే షూటింగ్ లు బ్యాన్ అవడంతో ప్రత్యేక విమానంలో ప్రభాస్ బృందం హైదరాబాద్ చేరుకుంది.

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ సంబంధించిన ప్రతి అపడేట్ సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. అందుకే ప్రస్తుతం #Prabas20 అంటూ సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ సందడి చేస్తోంది. ఎపుడో ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ షాట్ ఫొటోలను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ షేర్ చేయడంతో అవిపుడు వైరల్ అవుతున్నాయి.

ఓపెనింగ్ షాట్ కు ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను నవ్విస్తూ ప్రభాస్ ముచ్చట్లు చెబుతున్నారు. ఈ షాట్ కు హాజరైన రాజమౌళి, వినాయక్, కృష్ణంరాజు తదితరులను కూడా ఈ ఫొటోల్లో చూడొచ్చు. 

పూజ లాక్ డౌన్ లో పెట్టిన హా..టు... గ్యాలరీ మరోసారి కింది లింకులో చూడొచ్చు 

http://www.namasteandhra.com/news/post/pooja-hegde-lockdown-timespass-hot-show