ప్రభాస్ పక్కన దీపిక - తెలుగు డెబ్యూ కానే కాదు

August 05, 2020

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించబోయే సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ ఎంపికైన వార్త వైరల్ అవుతోంది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాధేశ్యామ్ తర్వాత సినిమా ఇది.

తాజాగా దీపిక పదుకొనే ప్రభాస్ హీరోయిన్ అని అధికారిక ప్రకటన రావడంతో ఆమె నటిస్తున్న తొలి తెలుగు సినిమా అని అందరూ అనుకుంటున్నారు.

కానీ ఇది నిజం కాదనే చెప్పాలి.

ఈ సినిమా ప్రకటించిన రోజే పాన్ ఇండియా సినిమా అని చెప్పారు.

దీని నిర్మాత, దర్శకుడు, హీరో తెలుగు వారు కావచ్చు గాని బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న చిత్రం ఇది.

హిందీతో పాటు తెలుగులో, తమిళంలో, కన్నడలో, మళయాళంలో విడదల కానుంది.

అంతేగాని తెలుగుకు హిందీ డబ్బింగ్ సినిమా కాదు ఇది. అందుకే దీనిని ఆమె తెలుగు డెబ్యూ అని అస్సలు అనలేం.

పైగా బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ ను తెలుగు నటుడు అనొచ్చు గాని టాలీవుడ్ హీరో అనలేం. అన్నీ హిందీ మార్కెట్ కోసమే ప్రభాస్ సినిమాలు చేస్తున్నారు.

బాలీవుడ్ లో పాపులర్ అయిన దీపిక ఎంట్రీతో సినిమా మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే... బాహుబలితో ప్రభాస్ బాలీవుడ్ హీరో అయ్యాడు గాని అనుష్క మాత్రం ఎందుకో తెలుగులోనే ఉండిపోయింది.

దీపిక పదుకొనే గురించి ఇంకో వాదన కూడా ఉంది. ఆమె టాలీవుడ్ అరంగేట్రం ఎప్పుడో జరిగిపోయిందట. 

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ ఆమెతో ఓ తెలుగు సినిమా ఐటెం సాంగ్ చేయించారట.

స్టిల్స్ బయటకు వచ్చినా పలు కారణాలతో ఆ సినిమా బయటకు రాలేదు జయంత్ దర్శకత్వంలో  తీసిన ఆ సినిమా పేరు ‘లవ్ ఫర్ ఎవర్’. సినిమా విడుదలకు నోచుకోలేదు.