సాహోకి ప్ర‌భాస్ కి ఇచ్చిన పారితోష‌కం ఎంతో తెలుసా?

February 21, 2020

బాహుబ‌లితో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి బడ్జెట్ హీరోయి ప్రభాస్ అనిపించుకున్నాడు. అయితే, ఇది తాత్కాలికమా? శాశ్వతమా? అన్నది సాహో సినిమా విడుదల అనంతరం అది సాధించే సక్సెస్ ని బట్టి ఉంటుంది. ఈ సినిమా కనుక హైప్ వచ్చిన విధంగానే హిట్ అయితే... ప్రభాస్ కి, దర్శకుడు సుజిత్ కి ఇక తిరుగుండదు. వారిద్దరి మీద ఇకముందు ఎంతయినా కాస్తారు నిర్మాతలు. ఒకవేళ ఈ సినిమా ఫ్లాపయితే ప్రభాస్ మళ్లీ సాధారణ తెలుగు సినిమా హీరోయి అయిపోతాడు. మనవాడు పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఇది పక్కన పెడితే... 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా హీరోకి సాహో సినిమా కోసం ఎంత పారితోషికం ఇచ్చారు అన్నది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే.. బాహుబలి తర్వాత ప్రభాస్ డేట్స్ కాస్ట్ లీ అయిపోయాయి. పైగా ఈ సినిమా ఎక్కువ డేట్స్ డిమాండ్ చేసింది. మధ్యలో వేరే సినిమా చేసే అవకాశం కూడా లేకపోయింది. దీంతో గట్టిగానే పారితోషికం అందుండాలి. కానీ ఇంతవరకు ఆ వివరాలు పెద్దగా బయటకు రాలేదు. పైగా ఈ సినిమా బిజినెస్ జరిగింది కేవలం ప్రభాస్ ని చూసే. అత‌డి పేరు మీదే ఈ సినిమా సేల్ అయింది. అలాంటపుడు మనోడికి భారీగానే ముట్టుండాలి. ఆల్మోస్ట్ బడ్జెట్లో పావు వంతు సుమారు 40-50 కోట్లు ప్రభాస్ కి అంది ఉండలి. ఓ ఇంట‌ర్వ్యూలో రెమ్యునరేషన్ గురించి అడిగితే.. నిర్మాతలు త‌న మిత్రులే అని, దాని గురించి ఇంకా మాట్లాడుకోలేదని చెప్పారు. సినిమా రిలీజ్ త‌ర్వాత ఆలోచిస్తామన్నారు. అంటే ఇక్కడ రెండు కొత్త డౌట్లు క్రియేట్ అయ్యాయి.
1. యువి క్రియేష‌న్స్ లో ప్రభాస్ ని పార్టనర్ అనుకోవచ్చా?
2. ప్రభాస్ పారితోషకం లేకుండా బడ్జెట్ 200 కోట్లు దాటిందా?

అమ్మో ఆలోచిస్తేనే... క్రేజీగా ఉంది. మరి ఈ విషయం ఎపుడు బయటపడుతుందో చూడాలి.