దేశాన్ని ఊపేస్తున్న తెలుగు బ్యాడ్ బాయ్

July 05, 2020

సాహో సినిమా రేంజ్ విడుదలకు ముందే అందరికీ పిచ్చెక్కిస్తోంది. అసలు ఈ సినిమాకు ఇంత క్రేజు ఎందుకొస్తుందో ఓ పట్టాన అర్థం కాని పరిస్థితి. యాక్షన్స్ సీన్స్ విషయంలో ఈ సినిమా బాలీవుడ్ కు ఒక బెంచ్ మార్క్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బాహుబలికి క్రేజు + యాక్షన్స్ సీన్స్... ఈ రెండింటి వల్ల దీనికి ఈ స్థాయి క్రేజు వచ్చిందంటున్నారు. మొత్తం అన్ని కలిపితే 500 కోట్ల బిజినెస్ జరిగినా ఆశ్చర్యం లేదు ఈ సినిమాకు.
ఇదిలా ఉండగా... ఈరోజు ఆ సినిమా నుంచి ’బ్యాడ్ బాయ్‘ అంటూ ఒక సాంగ్ విడుదల చేశారు. హాలీవుడ్ పాట రేంజ్ లో తీసిన ఈ పాటలో ప్రభాస్ తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రొమాన్స్ చేసింది. గతంలో విడుదలైన పాటలతో పోలిస్తే ఇది టాప్ అని చెప్పొచ్చు. వందలాది మంది హాట్ గర్ల్స్ మధ్య ప్రభాస్ రొమాంటిక్ గా కనిపించాడు. ఈ పాటకు కూడా భారీగానే ఖర్చుపెట్టారు. ఇపుడు ఇది ట్రెండ్ అవుతోంది.