ప్రభాస్ సంచలన నిర్ణయం.. మిగతా హీరోలేం చేస్తారో?

August 07, 2020

సాటి మనిషిని కాపాడే వాడు మనిషి.

ప్రకృతిని కాపాడేవాడు మహానుభావుడు.

ఏదో ఒక మొక్క నాటి... నా ఛాలెంజ్ అయిపోయందని అనుకుని చేతులు దులుపుకోకుండా ప్రభాస్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన చోట 1000 ఎకరాల స్థలంలో అడవిని తన స్వంత ఖర్చుతో పెంచుతాను అని ప్రభాస్ ప్రకటించారు. తన పెదనాన్న కృష్ణంరాజు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలు నాటిన ప్రభాస్... ఇక్కడితో ఆగను అడవిని పెంచుతాను అని ముందుకు రావడం సంతోషకరమైన పరిణామం. 

ఈ భూమి మీద ప్రతి ప్రాణి లాగే మనం కూడా. ప్రతి ప్రాణి ప్రకృతికి మేలు చేస్తుంది. మనిషి మాత్రం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. గత దశాబ్దాలుగా ఇది జరుగుతోంది. ఇపుడు ముప్పులోకి వెళ్లిపోయాం. త్వరగా జాగ్రత్తపడితేనే బయటపడతాం. ప్రభాస్ లాగే తాహతు ఉన్న ప్రతి ఒక్కరు తమ స్థాయిలో ప్రకృతికి తోడ్పడాలి.

Image 

తెలుగు రాష్ట్రాల్లో తన అభిమానులు అందరూ విరివిగా మొక్కలు నాటి పెంచాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎక్కడ చూపించినా తాను 1000 ఎకరాల అడవిని పెంచడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రభాస్ ప్రకటించారు.