మోడీ డబ్బులుపై జగన్ పేరు? అసలు కథేంటి?

August 07, 2020

ఏపీలో చంద్రబాబు హయాంలో సుమారు 180 సంక్షేమ పథకాలు అమలు చేశారు.

కేవలం నవరత్నాల కోసం వాటిలో సగం పథకాలకు పైగా జగన్ రద్దు చేశారు.

ఖజానాను నింపే ఐడియాలు జగన్ వద్ద లేకపోవడంతో ఆ పథకాలు రద్దు చేశారని టీడీపీ పలుమార్లు ఆరోపించింది. 

అమ్మఒడి పథకం తప్ప జగన్ కొత్తగా తెచ్చిన పథకాలేవీ లేవన్నది టీడీపీ వాదన.

తాజాగా మహిళకు ఆస్పత్రిలో ప్రసవానికి 5 వేలు ఇచ్చే కొత్త పథకం తెచ్చినట్టు జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటంచింది.

కొందరు చరిత్ర తెలియని జర్నలిస్టులు ఇది కొత్త పథకం అనుకుని గుడ్ న్యూస్ అంటూ రాసేస్తున్నారు. దీనిపై నమస్తేఆంధ్ర ఆరాతీయగా... ఇది కొత్త పథకం కాదు...అని, ఇప్పటికే ఉన్న పథకం అని తెలిసింది. 

ముందునుంచే అమలవుతున్న పథకానికి జగన్ కొత్త పేరు పెట్టారు అని తెలుస్తోంది. 

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. కేంద్రంలోని మోడీ సర్కారు దేశంలోని 650 జిల్లాల్లోని గర్భిణి మహిళలకు ప్రసవం జరిగిన తర్వాత తక్షణ సాయం అందంచడానికి ప్రధాన మంత్రి మాతృవందన యోజన పథకం పెట్టింది.

ఈ పథకం ప్రతి గర్భిణి ప్రసవానికి రూ.6 వేలు కేంద్రం అదిస్తోంది. 

మరి జగన్ ఈ పథకం డబ్బులే  వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరుతో అందజేస్తున్నారా? లేదా కేంద్రం ఇచ్చే 6 వేల రూపాయలతో పాటు తాను 5 వేలు కలిపి మొత్తం 11 వేలు ఇస్తారా అన్నది ఇంకా స్పస్టంగా ప్రకటించడం లేదు.

బహుశా ఇది ఎవరూ రాయరులే ... కేంద్రం ఇచ్చేవాటికి మనం క్రెడిట్ రాసుకుందాం అనుకున్నారో ఏంటో తెలియని పరిస్థితి. దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే అందరికీ ఉపయోగం. 

 

మరి చంద్రబాబు హయాంలో గర్భిణులకు ఏం చేశారు?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లి సురక్ష పథకం ప్రవేశపెట్టారు.

అంటే ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకున్నా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.

దీనిని ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా ఇచ్చేవారు. సహజకాన్పునకు 8 వేలు, సిజేరియన్ అయితే 14 వేలు చంద్రబాబు గవర్నమెంటు ఇచ్చేది.  

తల్లి సురక్ష పథకం కింద ఏటా ఐదులక్షల మంది గర్భిణులకు ఈ సాయం అందింది. 

జగన్ వచ్చాక ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని రద్దు చేశారు.

వెతికి వెతికి ప్రభుత్వ పథకాలు వీరికి అందించేవారు. ప్రతి శుక్రవారం గర్భిణుల ఇళ్లకు వెళ్లి వారికి ఆరోగ్యం, పౌష్టికాహార తదితర వివరాలపై అవగాహన పెంచితే... అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు రూ.100 అదనంగా ఇచ్చేది గవర్నమెంటు.

కొత్తగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణిలను రిజిస్టర్‌ ‌ చేయిస్తే... నెలకు రూ.200 అదనంగా చెల్లించేది. తరచూ వారికి అవసరమైన చికిత్సలు, మందులు, పోషకాహారాం ప్రభుత్వం అందించేది.

అంటే చంద్రబాబు ప్రభుత్వం గర్భిణులకు సాయం చేయడానికి ప్రత్యేక చొరవ తీసుకునేది.

ఆస్పత్రికి రాను పోను అంబులెన్స్ ఏర్పాటుచేసేది. పుట్టిన పిల్లలకు ఎన్టీఆర్ బేబీ కిట్ ఇచ్చేది.