వైసీపీకి గుండె దడ పుట్టించిన పోస్టరు

June 01, 2020

చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. ఆయన అధికారంలో ఉంటే రాజకీయంలో ఫెయిలవుతారు. కానీ ప్రతిపక్షంలో ఉంటే... అధికార పార్టీ తప్పులు చేయాలంటే చెమటలు పట్టేలా చేస్తారు. నిజానికి చంద్రబాబు చాణక్యం అధికారంలో ఉన్నపుడే చూపితే... ప్రతిపక్షాలకు అధికారం కూడా దక్కదు. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నంత సేపు రాజకీయం మరిచిపోయి అధికారం పోగొట్టుకుంటూ వచ్చారు. 

ఇటీవల తెలుగుదేశం పార్టీ కేడరులో సీనియర్లు ఎక్కువ, యాక్టివ్ లీడర్లు తక్కువ అన్నట్లుంది పరిస్థితి. పార్టీ అధికారం కోల్పోవడానికి ఇదొక కారణం... ప్రపంచం మొత్తం యువత వైపు చూస్తున్నడపుడు చంద్రబాబు సీనియర్లను చూసి కొత్త నాయకత్వం తయారుచేసుకోవడంలో నిర్లక్ష్యం చూపడం వల్ల ఈరోజు పార్టీకి ఇబ్బందులు వచ్చాయి. అయితే, ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ఉవ్వెత్తున లేచారు. ఏపీ నాయకత్వ అసమర్థతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పోరాడే గళాలను ఏకం చేయడానికి ప్రజా చైతన్య యాత్ర అంటూ పోరాటం మొదలుపెట్టారు. అలా చంద్రబాబు ప్రకటించారో లేదో అది ట్రెండ్ అయిపోయింది. దానికి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఆ కార్యక్రమానికి వస్తున్న మద్దతే ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనంగా భావించవచ్చు.

ఇక పోతే ఈ కార్యక్రమం 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. చంద్రబాబు కూడా కొన్ని చోట్ల పాల్గొంటారు. ప్రతిరోజు దీనిని సమీక్షిస్తారు. ప్రభుత్వం చేసే తప్పుపై ప్రజల తరఫున గళమెత్తే కార్యక్రమం ఇది. దీనికోసం టీడీపీ ఒక ప్రత్యేక పోస్టరు సిద్ధం చేసింది. దానికి నవ మోసాల పాలన అంటూ టైటిల్ పట్టింది. ఆ పోస్టరులో మూడు విభాగాలుగా జగన్ చేసిన తప్పులను ప్రస్తావించారు. 

రద్దులు, భారాలు, మోసాలు... అంటే జగన్ వచ్చాక రద్దు చేసిన ప్రజాసంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావించారు. జగన్ సీఎం అయ్యాక పెంచిన ఛార్జీలు, వేసిన భారాలను వివరించారు. ఇక ఎన్నికల ముందు చెప్పి చేయనవి, హామీ ఇచ్చి మరచినవి మోసాలు అంటూ వివరించారు. ఈ పోస్టరు చదివిన వారికి అందులో ప్రతి పాయింటుకు ఆధారాలు సాక్ష్యాలు గూగుల్ చేస్తే దొరికే పరిస్థితి ఉంది. ఇది జనాలకు చేరితే... కచ్చితంగా వారు ఆలోచనలో పడేలా రూపొందించారు. జగన్ కనుక ఈ పోస్టరు చదివితే... నేను ఇంత చండాలంగా పాలిస్తున్నానా అని భయపడేలా ఉన్నాయి అందులోని వివరాలు. మరి ... ఈ యాత్రపై వైసీపీ వర్గాల దండయాత్ర ఎలా ఉండబోతుందో రేపటి కి తెలుస్తుంది.