1983 ప్రభంజనాన్ని తలపించిన జనం

June 04, 2020

చంద్రబాబు కుప్పం ​పర్యటనను విఫలం చేయడానికి వైసీపీ వర్గాలు ఎంత ప్రయత్నించినా ఆ పర్యటన చంద్రబాబు, జగన్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అయ్యింది. కుప్పంలో అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబుకు వచ్చిన జన స్పందన చూస్తే... టీడీపీకి 1983 నాటి ఆదరణ మళ్లీ వచ్చిందా అన్నంతగా ఉంది. వీధులన్నీ పసుపు మయం అయ్యాయి. వైసీపీ 9 నెలల పాలనపై ప్రజా చైతన్య యాత్ర ఇటీవలే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతి నియోజకవర్గంలో విశేష స్పందన వస్తోంది. వైసీపీ 9నెలల పాలనలో 9 రద్దులు, 9 మోసాలు, 9 భారాలను ప్రజలకు చెప్పాలని నిర్ణయించిన పర్యటన తెలుగుదేశం పార్టీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అయ్యింది. దీంతో జగన్ - బాబు వార్ మరింతగా ముదిరింది. దీంతో టీడీపీని జగన్ ఎంత అణిచివేసే ప్రయత్నం చేస్తే అది అంత వేగంగా పైకి లేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

​ అయితే, ఈరోజు చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయినా కూడా బాబు పర్యటన భారీగా సాగింది. బాబు పర్యటన ఆసాంతం పూల వర్షం కురిసింది. భారీ క్రేన్ తో అతిపెద్ద గజమాలను చంద్రబాబుకు అలంకరించారు. ప్రజలు బాబుకు పడుతున్న బ్రహ్మరథం చూస్తుంటే... పంచాయతీ ఎన్నికల్లో జగన్ కి భారీ బ్యాండ్ తప్పదు అన్నట్లుంది. జగన్ ఓట్లకు గాలాలు వేస్తుంటే... బాబు మాత్రం జగన్ అసమర్థతను ప్రపంచానికి చాటుతున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న జగన్ చేసే పథకాల గిమ్మిక్కులు ఎక్కువ కాలం సాగే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. బెంగుళూరుకు విమానంలో వచ్చి అక్కడి నుంచి కుప్పం చేరుకున్న బాబుకు బెంగుళూరు నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేశాయి. కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురులో జరిగిన ప్రజా చైతన్య యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం కూడా చంద్రబాబు ఇదే నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర చేస్తారు.