ఎన్టీఆర్ గురించి ఈ అరుదైన ఆర్టికల్ చూశారా?

August 13, 2020

భారత రాజకీయాల్లో నందమూరి తారక రామారావు ఒక ప్రభంజనం. నిర్మలమైన మనసుతో అతను చేసిన రాజకీయ ప్రవేశం భారతదేశం మునుపెన్నడూ అనుభవం పొందని సరికొత్త రాజకీయ తరంగాలను సృష్టించింది. ఈ దేశపు అత్యంత శక్తిమంతమైన ప్రధానమంత్రిగా పేరొందిన ఉక్కు మహిళ ఇందిరను వణికించిన చాణక్యం, పవర్ ఎన్టీఆర్ సొంతం.

ఆ శిఖర శక్తి... ఒక ప్రాంతీయ పార్టీతోనే భారతదేశ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపారు. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు. పేదలకు ఇళ్లు అని ఎన్టీఆర్ మొదలుపెట్టిన పథకం ప్రపంచ మీడియాను ఆకర్షించింది. నా అక్కాచెళ్లెళ్లు నాతో సమానం కాదా అంటూ ఆడపిల్లకు ఆస్తి హక్కు అంటూ ఎన్టీఆర్ తెచ్చిన చట్టం... ఒక్కసారిగా దేశం ఏపీ వైపు చూసేలా చేసింది.

అందుకే అందరూ చేసింది రాజకీయ ప్రవేశం,

ఎన్టీఆర్ సృష్టించింది రాజకీయ ప్రభంజనం. 

తెలుగుదేశానికి అసలు ప్రత్యర్థి అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక సాక్షిలో 8 ఏళ్ల క్రితం ప్రకాష్ చిమ్మల అనే పాత్రికేయుడు రాసిన ఈ సూక్ష వ్యాసం... ఎన్టీఆర్ మొత్తం వ్యక్తిత్వాన్ని, స్టామినాను, అతని పాలనను అతి తక్కువ అక్షరాలతో క్లుప్తీకరించిన ఒక పాపులర్ ఆర్టికల్. ఎనిమిదేళ్లుగా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా మీ కోసం ....