ప్రశాంత్ కిషోర్ ... చంద్రబాబు ఏమన్నారో విన్నావా?

May 24, 2020

తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ జనాలు ఇష్టపడ్డారని...చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సెషన్స్ లో వ్యవహరించిన తీరుపై జరిగిన మీటింగులో వైసీపీ విజయానికి, టీడీపీ ఓటమికి చంద్రబాబు కారణాలు విశ్లేషించారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చెప్పిన చంద్రబాబు పార్టీని ప్రజలు వ్యతిరేకించలేదని అన్నారు. కాకపోతే నియోజకవర్గ స్థాయిలో, లబ్దిదారుల ఎంపికలో స్థానిక అవకతవకలు పార్టీకి నష్టం చేశాయన్నారు. మునుపటి ఎన్నికల్లో (2004, 2009) పార్టీపై వ్యతిరేకత కనిపించిందని, కానీ ప్రస్థుత ఎన్నికల్లో పార్టీపై వ్యతిరేకత ఏం లేదన్నారు.

వైసీపీ విజయం వెనుక పలు అంశాలున్నాయని, వాటిలో ప్రభావవంతమైనది ప్రశాంత్ కిషోర్ ని కన్సల్టెంట్ గా నియమించుకోవడం అని చంద్రబాబు చెప్పారు.  వైసీపీ రాజకీయా వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రభావం స్పష్టంగా కనపడిందన్నారు. ఇక సామాజిక సమీకరణలు కూడా వైసీపీకి తోడ్పడ్డాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులపై అవినీతి ముద్ర వేయడానికే టెండర్ల అంశాన్ని చాలా బాగా వాడుకున్నారని వైసీపీని తప్పు పట్టారు చంద్రబాబు.

ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన, ఓడిపోయిన 175 + 25 మంది అభ్యర్థులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ భవిష్యత్తు నిర్ణయాలపై చర్చించనున్నారు.