ఏం టైమింగ్ రా బాబూ నీది

June 01, 2020
CTYPE html>
ఏ సినిమా ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్ప‌లేం. కొన్నిసార్లు మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడ‌వు. అలాగే టాక్ బాలేని సినిమాలు కూడా కొన్నిసార్లు ఇర‌గాడేస్తుంటాయి. అందుకే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాల‌నేది కూడా ముఖ్య‌మైన విష‌యం అంటుంటారు సినీ పెద్ద‌లు. పండుగ‌లు, సెల‌వుల సీజ‌న్ల‌లో ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్లు రిలీజ్ చేస్తే మంచి ఫ‌లితం వ‌స్తుంటుంది. ఈ విష‌యం దృష్టిలో ఉంచుకునే క్రిస్మ‌స్ సీజ‌న్‌కు ప్ర‌తి రోజూ పండ‌గే సినిమాను షెడ్యూల్ చేశాయి గీతా ఆర్ట్స్, యువి క్రియేష‌న్స్ సంస్థ‌లు. ఈ చిత్రానికి టాక్ మ‌రీ గొప్ప‌గా ఏమీ లేదు. రివ్యూలు కూడా యావరేజ్‌గానే వ‌చ్చాయి. ఐతే కుటుంబ‌మంతా క‌లిసి చూసేందుకు త‌గ్గ ఎంట‌ర్టైన‌ర్ కావ‌డం దీనికి క‌లిసొచ్చింది.
పోటీగా వ‌చ్చిన మిగ‌తా మూడు సినిమాలు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. బాల‌య్య సినిమా రూల‌ర్‌ను ప‌ట్టించుకునేవాళ్లు లేరు. దొంగ‌, ద‌బంగ్‌-3 సినిమాల ప‌రిస్థితీ అంతే. ప్రేక్ష‌కుల ఛాయిస్ ప్ర‌తి రోజూ పండ‌గేనే. మిగ‌తా మూడు సినిమాల వ‌సూళ్లన్నీ క‌లిపినా మారుతి సినిమా క‌లెక్ష‌న్ల ముందు త‌క్కువే ఉంటున్నాయి. వీకెండ్లో హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతూ రూ.23 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన ఈ చిత్రం.. సోమ‌వారం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌లంగా నిలిచింది. ఫ‌స్ట్, సెకండ్ షోల‌కు మంచి ఆక్యుపెన్సీ క‌నిపించింది. అక్క‌డ‌క్క‌డా ఫుల్స్ కూడా ప‌డ్డాయి. దీని జోరు చూస్తే ఈ వార‌మంతా కూడా బాక్సాఫీస్ లీడ‌ర్‌గా నిలిచేలా ఉంది. బుధ‌వారం ఇద్ద‌రిలోకం ఒక‌టే, మ‌త్తు వ‌ద‌లరా లాంటి చిన్న సినిమాలొస్తున్నాయి. అవి ప్ర‌తి రోజూ పండ‌గే వ‌సూళ్ల మీద ఏమాత్రం ప్ర‌భావం చూపిస్తాయో చూడాలి.