అలా చెయ్యకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది-RRR

August 07, 2020

అలా చెయ్యకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది.. సరైన సలహాలు ఇస్తారని అనుకుంటున్నా అంటున్న రఘురామకృష్ణంరాజు...


నిమ్మగడ్డ నియామకం పై హైకోర్టు ఆదేశాలు పాటించాలి అంటూ గవర్నర్ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల పై వైసిపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.

ఆయన మాట్లాడుతూ, "ప్రభుత్వానికి ఎదురు దెబ్బ కాదా అనేది పక్కన పెడితే, నేను రాజ్యాంగం పరిరక్షంచబడిందని చెప్తున్నాను. ఇది మంచి పరిణామం. గవర్నర్ గారు ఆలస్యం అయినా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇందాకే నేను ట్వీట్ చేశాను. మా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సాగతియ్యకుండా గవర్నర్ నిర్ణయన్ని అమలు చెయ్యటమే ఉత్తమం.

ఎందుకంటే ఇప్పటికే చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. రేపు సుప్రీం కోర్టుకు వెళ్ళినా ఇదే తీర్పు వస్తుంది. అలా కాదని ముందుకు వెళ్తే, రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. అప్పుడు ఆర్టికల్ 356 ఇన్వొక్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి.

బలవంతంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, మాకు చాలా మంది సలహాదారులు ఉన్నారు కాబట్టి, సరైన సలహాలు ఇస్తారనే అనుకుంటున్నా.

అలా కాకుండా, గతంలో లాగా మళ్ళీ ఈ విషయం పై ఏదో చిన్న చిన్న విషయాలు పట్టుకుని మళ్ళీ దీన్ని ఏదో ఒకటి చేసి పీకలు మీదకు తెచ్చుకోకుండా నిమ్మగడ్డను మళ్ళీ నియమించటమే ఉత్తమం."

"రేపు స్థానిక ఎన్నికలు ఆయనతో జరిగితే అందరికీ మంచింది. అయితే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అది వేరే విషయం.

కానీ కనకరాజు గారి అపాయింట్మెంట్, ఆర్డినెన్స్, వీటి అన్నిటి పై, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అమలు చెయ్యాలని గవర్నర్ గారు ఆదేశాలు ఇచ్చారు.

మా ప్రభుత్వం అవి అమలు చేస్తుందని అనుకుంటున్నా. మరింత రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే పరిస్థితి తీసుకు రావద్దు అని మా ప్రభుత్వానికి చెప్తున్నాను. ప్రభుత్వం గవర్నర్ చెప్పిన దాన్ని అడ్డుకోవటం ఉండదు.

అలా చెయ్యకుండా ఉంటే రాజ్యాంగ సంక్షోభం, రాష్ట్రపతి పాలన వస్తుంది.

అంత వరకు వెళ్ళరు అనే అనుకుంటున్నా. నన్ను అడిగితే సుప్రీం కోర్టు నిర్ణయం వరకు కాకుండా ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిది.

కోర్టుల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారికి మా ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే మనం నవ్వుల పాలు అవుతాం" అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.