140 కోట్లు పెట్టి మన హీరోయిన్ ఇల్లు కొనేసింది !!

February 19, 2020

బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ.. కొందరు మాత్రమే వెండితెర మీద రాణిస్తారు. భారీ ఇమేజ్ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పక్కా ప్లానింగ్ తో కెరీర్ ను మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ లోనూ దూసుకెళుతుంటారు. అలాంటి భామల్లో ప్రియాంకను చెప్పుకోవాలి. బాలీవుడ్ లో తన మార్క్ చూపించిన ఆమె.. టైం చూసుకొని హాలీవుడ్ కు షిఫ్ట్ కావటమే కాదు.. అక్కడా తన ముద్రను వేయగలిగారు.
ఇప్పటికి పలువురు బాలీవుడ్ భామలు హాలీవుడ్ కు వెళ్లి తమ లక్ ను పరీక్షించుకున్నా.. ప్రియాంక మాదిరి వరుస ఆఫర్లను చేజిక్కించుకున్న వారు లేరనే చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే హాలీవుడ్ సెలబ్రిటీ.. తన కంటే చిన్నోడైన నిక్ ను పెళ్లాడి మరో సంచలనానికి తెర తీశారు ప్రియాంక. ఈ జంట తరచూ వార్తల్లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. పెళ్లయ్యాక లాస్ ఏంజిల్స్ లోని బెవెర్లీ హిల్స్ లో ఉంటున్నారు.
ఐదు బెడ్రూంలతో పాటు.. స్విమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలున్న ఈ ఇంటి విలువ రూ.50 కోట్లుగా లెక్క కట్టి దాన్ని తాజాగా అమ్మేశారు. ఎందుకంటే.. ఇప్పుడున్న ఇల్లు సౌకర్యవంతంగా లేదని.. మరింత లగ్జరీతో పాటు.. సౌకర్యాలున్న ఇంటి కోసం వెతుకుతున్నారు. తమ అభిరుచికి తగ్గ ఇంటిని ఎంపిక చేసుకున్న వారు.. దాన్ని కొనేందుకు సిద్ధమవుతున్నారట.
ప్రియాంక నిక్ సన్నిహితుల సమాచారం ప్రకారం తాజాగా ఈ కఫుల్ కొనుగోలు చేయనున్న విల్లా ఖరీదు రూ.140 కోట్లుగా చెబుతున్నారు. దీనికి చేయించాల్సిన మార్పులు చేర్పులకు దాదాపు ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. దీనికి తోడు నిక్ తన సోదరుడితో కలిసి మ్యూజిక్ టూర్ కు వెళ్లనున్న నేపథ్యంలో ఇంటి గృహప్రవేశం వచ్చే ఏడాదే ఉంటుందంటున్నారు. అయితే..వారు కొనాలనుకున్న డీల్ ఫైనల్ కాలేదని చెబుతున్నారు. ఏమైనా.. ఇంత ఖరీదైన ఇల్లు బాలీవుడ్ లో మరే భామకు లేదన్న మాట వినిపిస్తోంది.  

Read Also

విజయవాడలో దేశద్రోహులు !
పదవి ఇచ్చినా... పృథ్వీలో అసంతృప్తి ఎందుకు....?
ఆర్టికల్ 35ఏలో ఏముంది? దాన్ని ఎందుకు రద్దు చేశారు?