ఆమెను నెటిజన్లు ఈరోజు ఫుట్ బాల్ ఆడుకున్నారుగా....

July 14, 2020

వాక్ స్వాతంత్ర్యం ఉన్నపుడు జనం ఏం మాట్లాడినా భరించాల్సిందే అది హింస కానంత వరకు. సెలబ్రిటీలు మంచి ఉద్దేశంతో చేశారా? చెడు ఉద్దేశంతో చేశారా అన్నది కాదు... లుక్స్ మరియు నటనపై ఆధారపడి నిలదొక్కుకునే వారి జీవితాల్లో రెండింటికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఇదిగో నువ్వు దీనికి తిట్టు, దీనికి విమర్శించు దీనికి పొగుడు అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఇక్కడ. నీ పని నువ్వు చెయ్యి. వాళ్ల పని వాళ్లు చేస్తారు అంతే. 

ఏమిటిదంతా అనుకుంటున్నారా.... 

న్యూయార్క్‌‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో మెట్‌ గాలా ఈవెంట్ సోమవారం ప్రారంభమైంది. ఇదొకటి జరుగుతుందని చాలా మంది సామాన్యులకు తెలియదు. కానీ ఈరోజు ఈ షోకు హాజరైన ప్రియాంక చోప్రా పుణ్యమా అని ఆ షో ఇండియన్ నెటిజన్స్ అందరికీ తెలిసిపోయింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రతి సంవత్సరం చారిటీ కోసం ఒక ప్రోగ్రాం చేస్తుంది. దాని పేరు ‘మెట్ గాలా'. దీనికి ప్రతి ఏడాది థీమ్ మారుతుంది. థీమ్ ఏదైనా వింత వింత దుస్తుల్లో సెలబ్రిటీలు ఈ వేడుకకు రావాలి. దీనివల్లే ఈ మెట్ గాలా చాలా పాపులర్ అయ్యింది. తమకు ఇష్టమైన సెలబ్రిటి ఇంతవరకు కనిపించనంత విభిన్నంగా కనిపించడం పై అందరికీ ఆసక్తి కలిగించి ఈ ప్రోగ్రాం విజయవంతంగా నడిపిస్తున్నారు. అత్యధిక విరాళాలు సేకరించే కార్యక్రమం అమెరికాలో ఇదే. దీనికి ఈ సారి బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనె, ఇషా అంబానీ వింత వస్త్ర ధారణలో హాజరయ్యారు. ప్రియాంక లుక్ ఈరోజు నెటిజన్లకు భారీ ఫన్ ఇచ్చింది. పిచ్చుక గూడును తలపించిన ఆమె హెయిర్ స్టైల్ విపరీతంగా ట్రోల్ అయ్యింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. 

వాటిలో కొన్ని ఇవి?

1. మాలింగ ఆర్ ప్రియాంక ఎవరు బెటరు? 

2. ఒరిజినల్ పిక్ వర్సెస్ ఆధార్ ఫొటో 

3. వీరప్పన్ మీసం నుంచి స్ఫూర్తి పొందిన ప్రియాంక హెయిర్ స్టైల్

4. టూత్ బ్రష్ కొన్నపుడు... మూడు నెలలు వాడాక

5. రైతులకు కొత్త దిష్టిబొమ్మ దొరికింది

ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ #priyankachopra అని సెర్చ్ చేయండి.