ప్రియాంక గాంధీకి ఎంత కోపం వచ్చిందంటే...

May 27, 2020

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మికి గురైన కాంగ్రెస్‌.. దానికి సంబంధించిన షాక్ నుంచి ఇంకా తేరుకోన‌ట్టుంది. ప‌లితాలు వెలువ‌డి మూడు వారాలు గ‌డుస్తున్నా.. ఆ పార్టీ నేత‌లు ఇంకా ప‌రాజ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డన‌ట్లుగా వారి వ్య‌వ‌హార‌శైలి ఉంది. తాజాగా పార్టీ దారుణ ఓట‌మికి సంబంధించి తీసుకున్న చ‌ర్య‌ల్లో భాగంగా త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని తొల‌గిస్తూ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ నిర్ణ‌యం తీసుకున్నారు.
యూపీఏ ప్ర‌భుత్వంలో ప్ర‌జా సంక్షేమ విధానాల రూప‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ధీర‌జ్ శ్రీ‌వాస్త‌వ ప్రియాంక‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో సోనియాగాంధీకి.. అశోక్ గెహ్లాట్ కు ఓఎస్డీగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రియాంక‌కు పీఎస్ గా వ్య‌వ‌హ‌రించారు.
ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆయ‌న్ను ప్రియాంక తొల‌గించారు. పార్టీ ఓట‌మికి కేడ‌ర్.. దిగువస్థాయి నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల‌ని వ్యాఖ్యానిస్తున్న ప్రియాంక తాజాగా.. త‌న పీఎస్ మీదా వేటు వేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌మ‌ర్థులు కాని వారంటూ వేటు వేసే క‌న్నా.. వారి ఎంపిక స‌మ‌యంలోనే ఆ విష‌యాన్ని గుర్తించి ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కుండా ఉంటే బాగుండేది క‌దా? ఆ ప‌ని ప్రియాంక లాంటి తెలివైనోళ్లు ఎందుకు చేయ‌న‌ట్లు..?