ఇదే...ప్రియాంక‌రెడ్డి నిందితుల గ్రూప్ ఫోటో (స్టేషన్ ఫొటో)

May 30, 2020

పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి  మద్యంమత్తులో కామాంధులుగా మారిన నలుగురి మధ్య నలిగిపోయింది. అత్యంత దారుణ‌మైన స్థితిలో ప్రాణాలు విడిచింది. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు లారీడ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. లారీడ్రైవర్ మహ్మద్‌పాషా.. క్లీనర్ శివతో పాటు వారిద్ద‌రి స్నేహితులు నవీన్, చెన్నకేశవులు ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టార‌ని తేల్చారు. ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు ఎలాంటి సహాయం ఉండదని, వారి తరపున వాదించమని షాద్‌నగర్ బార్ అసోసియేషన్ ప్రకటించింది. కాగా, షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్న స‌మ‌యంలో...అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. అయితే, ఈ స‌మ‌యంలోనే.. విచార‌ణ‌లో ఉన్న న‌లుగురు మాన‌వ మృగాల ఫోటో తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.
ప్ర‌ధాన నిందితుడైన‌ లారీ డ్రైవర్ మహ్మద్‌పాషా, స‌హ నిందితులు శివ,నవీన్, చెన్నకేశవులును షాద్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లోనే  మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విచారించారు. నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, హంతకులకు మహబూబ్‌నగర్ జైలుకు తరలించేందుకు సిద్ధ‌మైన‌ప్ప‌టికీ...భ‌ద్ర‌త స‌మ‌స్య‌ల కోణంలో చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు.
అయితే, డాక్టర్ హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో...వారిని తమకు అప్పగించాలంటూ స్థానిక ప్రజలతో పాటు పెద్ద ఎత్తున జనం షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే నిందితులను ప‌క్కా భ‌ద్ర‌త మ‌ధ్య‌ పోలీసు వాహనాల్లో చర్లపల్లికి తరలించారు. దీంతో చర్లపల్లి జైలు దగ్గరకు కూడా చేరుకున్న కొంత మంది యువకులు నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. లేదంటే వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు మోహరించారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Read Also

తెలంగాణలో కొత్త పార్టీ... మాజీ జనసైనికుడే అధినేత
అశ్వత్థామరెడ్డి.. కెరీర్ క్లోజ్ .. ఎలాగంటే !
లండన్‌లో ఘ‌నంగా "కేసీఆర్ - దీక్షా దివస్"