ప్రియాంక నిందితులు ఎలా దొరికిపోయారో తెలుసా?

May 31, 2020

సంచ‌ల‌నం సృష్టించిన ప్రియాంక రెడ్డి అత్యాచారం, హ‌త్య కేసులో నిందితుల్ని ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇంత త్వ‌ర‌గా కేసును ఛేదించ‌డంలో ప్రియాంక కాల్ డేటానే కీల‌కంగా మారిన‌ట్లు వెల్ల‌డైంది. త‌న‌పై అఘాయిత్యం జ‌ర‌గ‌డానికి ముందు ప్రియాంక మాట్లాడిన ఓ కాల్ ఆధారంగా పోలీసులు మొత్తం కూపీ లాగి నిందితుల్ని ప‌ట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ కాల్ వివ‌రాలేంటో..  చూద్దాం  

న‌వంబ‌రు 28, గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ప్రియాంక‌ టోల్‌ ప్లాజా వద్ద త‌న స్కూటీని పార్కింగ్‌ చేయడాన్ని నలుగురు నిందితులు చూశారు. ఆ సమయంలో వారంతా మద్యం సేవిస్తున్నారు. రాత్రి 9 గంట‌ల త‌ర్వాత ప్రియాంక టోల్‌ ప్లాజా వద్దకు వచ్చింది. అప్ప‌టికే స్కూటీ టైరు పంచ‌ర్ అయి ఉంది. ఆ సమయంలో నిందితుల్లో ఒక‌డైన ఆరిఫ్‌ అక్కడికి వచ్చి  తాను పంచ‌ర్ వేయిస్తాన‌న్నాడు. అప్పుడే ప్రియాంక ఫోన్‌ నంబరు కూడా తీసుకున్నాడు. అత‌ణ్ని నమ్మి వాహనం ఇచ్చిన ప్రియాంక‌... 15 నిమిషాల తర్వాత కూడా అత‌ను రాకపోయే సరికి అనుమానం వచ్చి ఆరీఫ్‌కు ఫోన్‌ చేసింది.

ప్రియాంక కాల్ డేటాను ప‌రిశీలించిన‌పుడు అఘాయిత్యం జ‌ర‌గ‌డానికి ముందు ఆరిఫ్ నంబ‌రుకు ఫోన్ చేసిన‌ట్లు తేలింది. ద‌ర్యాప్తులో ఇదే పోలీసులకు కీలక ఆధారమైంది. ఫోన్‌ కాల్‌ ఆధారంగానే ఆరిఫ్‌ ఆచూకీని పోలీసులు గుర్తించగలిగారు. అతడిని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటికొచ్చింది. మిగ‌తా ముగ్గురు నిందితుల‌నూ ప‌ట్టుకుని అస‌లేం జ‌రిగిందో తెలుసుకున్నారు. 

Read Also

ఇదే...ప్రియాంక‌రెడ్డి నిందితుల గ్రూప్ ఫోటో (స్టేషన్ ఫొటో)
తెలంగాణలో కొత్త పార్టీ... మాజీ జనసైనికుడే అధినేత
అశ్వత్థామరెడ్డి.. కెరీర్ క్లోజ్ .. ఎలాగంటే !