మదనపల్లె రైతు - ప్రియాంక చోప్రా కామెంట్

August 09, 2020

ఆధునిక దానకర్డును సోనూసూద్ చిత్తూరు రైతుకు చేసిన దేశ వ్యాప్తంగా వైరల్ అవడం తెలిసిందే. చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతానికి రైతు నాగేశ్వరరావు వ్యవసాయ ఆదాయంతో ఇద్దరి పిల్లలను చదివించుకోవడం కష్టమవుతుందని పట్టణం వెళ్లి టీకొట్టు పెట్టుకున్నారు. అయితే, కరోనాతో అతని ఉపాధి పోయింది. ఈ నేపథ్యంలో తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేయడానికి ప్రయత్నించారు. కూతుర్లు కాడె పట్టుకోగా నాగేశ్వరరావు పొలం దున్నారు. 

ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో సోన్ సూద్ కి చేరింది. ఆయన ఈ వీడియో చూసి స్పందించి ఆ రైతుకు ట్రాక్టరు కొనిచ్చారు. సోనుసూద్ సాయాన్ని అందరూ వేనోళ్ల పొగిడారు. దీనిపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. ఈ వారం తనలో స్ఫూర్తి నింపిన విషయాలు అంటూ కొన్ని ఘటనలు వివరించిన ప్రియాంక సోను సూద్ సాయాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసించింది.

లాక్డౌన్ లో ఎంతో మందికి సాయం చేసిన సోనుసూద్ తాజాగా ఎద్దులను కూడా అద్దెకు తీసుకోలేని ఒక రైతును ఆదుకుని ట్రాక్టర్ కొనివ్వడం ఎంతో సంతోషకరమని ప్రియాంక చోప్రా పేర్కొంది. సోనుసూద్ చాలా అద్భుతమైన పని చేస్తున్నారంటూ ప్రియాంక చోప్రా కీర్తించారు. సోను ఇలా అందరినీ ఆదుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు.