రాసలీలల కేసు - పృథ్వి అడ్డంగా బుక్ అటగా...

May 26, 2020

ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్, వైసీపీ నేత, సినీ నటుడు పృథ్వి రాసలీలలు బయటపడినట్టు తాజాగా తెలుస్తోంది. ఒక తెలుగు ఛానెల్ ’’పృథ్వి ఒక మహిళతో మాట్లాడిన శృంగారాత్మక సంభాషణ’’ అంటూ ఆడియో టేపును ప్రసారం చేసింది. అందులో ఒక మహిళతో పృథ్వి చాలా చనువుగా మాట్లాడారు. నీతో మందు తాగాలని ఉంది, నీతో సమయం గడపాలని ఉంది, నిన్ను వెనుక నుంచి కౌగిలించుకుందాం అనుకున్నాను. కానీ అరుస్తావేమో అనుకున్నాను ... ఇలాంటి మాటలు అందులో ఉన్నాయి. 

అయితే, ఇవి ఆడియో టేపులు కావడంతో వాయిస్ అచ్చం పృథ్విలాగే ఉన్నా ఇంకా నిరూపణ కావాల్సి ఉంది. ఒకవైపు పవిత్ర తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో నడిచే టీటీడీ ఛానెల్ ఛైర్మన్ గా ఉంటూ ఆయన ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం పెద్ద వివాదం అయ్యేలా ఉంది. పృథ్వి పదవికే ముప్పు రావచ్చు. అయితే... దీనిని పృథ్వి ఖండించారు. నన్ను భ్రష్టుపట్టించడానికి కొందరు చేసిన కుట్ర ఇది అని ఆయన కొట్టిపారేశారు. అయితే, నిజానిజాలు నిగ్గుతేలాల్సి ఉంది.