బ్రేకింగ్‌: ఎస్వీబీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి పృథ్వీ అవుట్ !

July 16, 2020

అమరావతి రైతుల శాపం పృథ్వికి గట్టిగా తగిలింది. 48 గంటలు తిరిగేలోపు పృథ్వి పదవి ఊడింది. పవిత్ర పదవులను అలంకరించినపుడు పవిత్రంగా ఉండాలి. కనీసం బాధ్యతగా అయినా ఉండాలి. రెండూ పృథ్వి పాటించలేదు. భూములిచ్చిన రైతులను అన్యాయం చేసి, రాయలసీమ ప్రజలకు రాజధానిని దూరం చేసిన విధానాన్ని సమర్థించడమే కాకుండా రైతుల పట్ల అమానవీయంగా మాట్లాడిన పృథ్వి కామక్రీడ ఎఫెక్ట్ నేపథ్యంలో పదవి పోగొట్టుకున్నారు. 

పార్టీ గెలిస్తే స్టార్ అవుతా.... గెలవకపోతే పెద్దగా నష్టపోయేదేముంది అని గేలమేసిన పృథ్వి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో గ‌ట్టిగా వాయిస్ వినిపించారు. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని భుజాల మీద మోశారు. ఆ పొగడ్తలు అతని అర్హతకు మించిన పదవిని తెచ్చిపెట్టాయి. ఏకంగా అత్యంత పవిత్రమైన ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి దక్కించుకున్నారు. కానీ తప్పుడు కూతలతో ఆరు నెల‌లైనా పదవి నిలబెట్టుకోలేకపోయారు. 

ఓ మహిళతో అతను చేసిన సరస సంభాషణతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అతన్ని దుమ్మెత్తిపోశారు. దీంతో పృథ్వీ ఆదివారం ఆ ప‌ద‌వికి రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఆ ఆడియో టేపులో ఉన్నది తాను కాదని వివరణ ఇచ్చుకున్నా కూడా అతను ఉన్నది టీటీడీ కి చందిన పదవి కావడంతో రాజీనామా చేయక తప్పలేదు. హైద‌రాబాద్ సోమాజిగూడ‌లోని ప్రెస్ క్ల‌బ్‌లో ప్రెస్ మీట్ పెట్టి పృథ్వీ త‌న రాజీనామాను ప్ర‌క‌టించారు. 

Read Also

‘అల వైకుంఠపురములో’ రివ్యూ
అమరావతి విషయంలో బీజేపీ షాకింగ్ డెసిషన్ ??
జగన్‌పై సినీ ప్రముఖుడి ఫైర్