నన్ను రేప్ చేశారు... పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

August 05, 2020

30 ఈయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...ఏ డైలాగ్ ఎలా చెప్పాలో నాకే నేర్పిస్తావా....అంటూ వెండితెర ప్రేక్షకులను నవ్వించడం మొదలుపెట్టిన పృథ్వీ తనదైన మార్క్ పంచ్ డైలాగ్ లతో టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. పండిపోయిందిక్కడ...రంగేశామంతే.....అమ్మ నా బత్తాయో....ఝకాస్...అంటూ డైలాగులు చెబుతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న పృథ్వీ .....రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైసీపీకి మద్దతు తెలిపిన పృథ్వీ....జగన్ సీఎం అవుతారంటూ ఎన్నిలకు ముందే ముమ్మరంగా ప్రచారం చేశారు. వైసీపీ విధేయుడిగా ముద్రపడ్డ పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ చైర్మన్ పదవి వరించింది. అయితే, అనూహ్యంగా పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వవ్చింది. ఆ తర్వాత మీడియాలో లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్న పృథ్వీ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తనను కుట్రపూరితంగా ఈ వ్యవహారంలో ఇరికించారన్న పృథ్వీ ....రేప్ జరగకుండానే రేప్ జరిగిపోయిందన్నట్లు తన పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆడియో టేపు ఆరోపణలపై పృథ్వీ స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ... ఎస్వీబీసీ వ్యవహారంపై మాట్లాడారు. ఎవరో గిట్టని వాళ్లు తనను అన్యాయంగా ఆ వ్యవహారంలో ఇరికించారని పృథ్వీ వాపోయారు. `పోకిరి` సినిమాలో రౌడీలు ఇలియానా బట్టలు చించేసి నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారరని....అదే తరహాలో తన పరిస్థితి ఉందని అన్నారు. బట్ట కాల్చి వేసి వెళ్లినట్లు...తనపై లేనిపోని అభాండాలు వేసి వదిలేసారరి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి దండిస్తారని అన్నారు.
తానంటే గిట్టని కొందరు వైసీపీ నేతలు ఈ వ్యవహారం వెనుక ఉన్నారని పృథ్వీ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ రాజీనామా చేయాలని కోరలేదని, వైవీ సుబ్బారెడ్డి కోరడంతోనే రాజీనామా చేశానని అన్నారు. ఆ ఆడియో టేపులు రిలీజ్ కావడానికి రెండు రోజులు ముందు ఓ ఛానెల్ సీఈవో తనను బెదిరించారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
తనను ఇబ్బంది పెట్టిన వారెవరూ ఇపుడు బతికి లేరని.. తను ఇరికించిన వారంత నాశనమైపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు సినిమాలలో బిజీగా ఉంటూ రాజకీయాలలోకి వెళ్లిన పృథ్వీపై వచ్చిన ఆరోపణలు సినీ కెరీర్ పై కూడా పడ్డాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.