వైసీపీ పెట్టిన పోల్స్ లో జగన్ అట్టర్ ఫ్లాప్

August 03, 2020

ఇంకే ముంది... జగనన్న వచ్చాడు. అన్నీ అందరికీ ఫ్రీ. అలా కాలు మీద కాలేసుకుని కూర్చుని తినడమే అని కలలు కని 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఆరు నెలలుగా ఎలా హాహా కారాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అన్న వచ్చాడు. అన్నీ కోశాడు. ప్రతి పథకానికి షరుతులు పెట్టాడు. కనిపించిన వాటన్నింటికి రంగులు వేశాడు. చంద్రబాబు 1300 కోట్లతో పట్టిసీమ కడితే... అదే 1300 కోట్లు ఏపీకి రంగులు వేశాడు. 5 లక్షల ఉద్యోగాలు పీకేశాడు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. మందు రేటు పెంచాడు. అమ్మఒడికి కన్నం పెట్టాడు. పింఛనుకు కోత పెట్టాడు. ఇసుకంటే... అమ్మో ఇసుక అనిపించాడు. ఒకటా రెండా... చెబుతూ పోతే డైరీ నిండేటంతటి ఘన చరితను సృష్టించారు ముఖ్యమంత్రి జగన్. పాపం .. పబ్లిక్ టాక్ తెలియని వైసీపీ అభిమానులు పోల్ పెట్టి అన్నకు అంకిత ఇద్దాం అనుకున్నారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఒక అక్కౌంట్లో (ట్విట్టరు అడ్రెస్... @2024YSRCP) పోల్ పెడితే... అందులో ఉండేవారంతా వైసీపీ ఫ్యాన్స్ అయినా కూడా పోల్ మాత్రం జగన్ కి పూర్తి నెగెటివ్ రిజల్ట్ ఇచ్చింది. 9064 మంది ఓట్లు వేయగా 51 శాతం మంది జగన్ పాలన బాలేదని అన్నారు. ఒక వైసీపీ అక్కౌంట్లోనే ఇంత నెగెటివిటీ ఉంటే... ఇక సాధారణ ప్రజల్లో ఇంకెంత ఘోరంగా ఉంటుందో. 

ఈ అక్కౌంట్లో మాత్రమే కాదు... పోల్ పెట్టిన అన్ని వెబ్ సైట్లు అక్కౌంట్లలోను జగన్ కు పబ్లిక్ ఒపీనియన్ యాంటీగానే ఉంది. వైసీపీ వారు ఎంత కవర్ చేద్దామన్నా కుదరడం లేదు. అందుకే రిజల్టు చూశాక వైసీపీ అక్కౌంట్లు అన్నింటిలో పోల్ ను డిలీట్ చేశారు. జగన్ కు వచ్చిన స్పందనకు సంబంధించి రెండు స్క్రీన్ షాట్లు ఇవి.