పీవీ తన 1000 ఎకరాలు ఏం చేశారో తెలుసా?

August 10, 2020

ప్రధాని ఐదు సంవత్సరాలు పనిచేసిన పీవీ నర్సింహారావు... కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు అంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన పనిచేసింది దేశంకోసమే గాని పార్టీ కోసం కాదని. మన దేశంలో స్వేచ్ఛ నిరాటంకంగా పరిఢవిల్లింది, దేశం ముందుకు నడిచిందంటే... మహానుభావులు దేశంకోసం అహర్నిశలు ఆలోచించడం వల్లనే సాధ్యమైంది. 

మొరార్జీ దేశాయ్, లాల్ బహూదర్ శాస్త్రి, వాజ్ పేయి, పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ ... వీరంతా స్వార్థ రహితంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన మనుషులు.

ఈరోజు మనం పీవీ శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పీవీ గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి.

పీవీ ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు. ఆయన భూసంస్కరణలు కూడా చేశారు. అందులో భాగంగా తనకున్న భూమిలో అత్యధిక భాగం అంటే... వెయ్యి ఎకరాలు ప్రభుత్వానికి వదిలేశారు. అదేదో పనికి రాని చౌడు భూమి కాదు. బంగరు పంటలు పండే మంచి నేల. మనం మంచి చేయకుండా ఇతరులను చేయమనడం భావ్యం కాదు. ప్రభుతం చేసే ఏ సంస్కరణలు అయినా ప్రభుత్వంలో ఉన్న వారి నుంచే మొదలుకావాలాంటరాయన.