బాస్ జగన్ కి... పీవీ రమేష్ సలహా అదిరిందిగా

August 07, 2020

స్వానుభవం అయితే గాని తత్వం బోధపడదు అని సామెత. తనను బాగా చూసుకుంటే తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తాయి. కాస్త పక్కన పెట్టిన వెంటనే అసలు తప్పులు అర్థమవుతాయి. మొన్నటి వరకు జగన్ టీంలో తిరుగులేని శక్తి అనుభవించిన సలహాదారు పీవీ రమేష్ ఇపుడు రెక్కలు లేని పక్షిలా ... అధికారాలు లేని అధికారిగా సలహాదారు పోస్టుకే పరిమితం అయిపోయారు. దీంతో ఇంతకాలం ఏనాడూ తన బాస్ జగన్ మాస్క్ పెట్టుకోవడం గురించి మాట్లాడని పీవీ రమేష్ గారు... తాజాగా తన బాస్ పేరు ఎత్తకుండానే చురక అంటించారు.

మాస్క్ ధరించిన ట్రంప్ ఫోటోను షేర్ చేస్తూ ప్రపంచంలోని నేతలందరూ ఇలా మాస్కులను ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తే బాగుంటుందని ట్వీట్ చేసాడు పీవీ రమేష్ కుమార్.  పాలకులు, నాయకులు మాస్కు వేసుకుంటే సాధారణ ప్రజలు కూడా వేసుకుంటారని ... జనానికి మాస్కు వేసుకోవడం ద్వారా రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు. అయితే జగన్ పేరు ఎత్తలేదు. 

మరి ఆయన ఏపీ అధికారి. ఏపీలో పాలకుడు ఎవరు జగన్. మరి ఆయన ఉద్దేశం జగన్ లాంటి వారు మాస్క్ వేసుకుంటే అందరికీ స్ఫూర్తి ఇచ్చినట్లుంటుందనే కదా అర్థం. ఇంతకాలం బాగా చూసుకున్నారు కాబట్టి మంచి మాటే అయితే  చెబితే తనకు నష్టం చేస్తుంది అనుకున్నారు. కానీ ఇపుడు అన్ని అధికారాలు, శక్తులు ఊడబీకాక మంచి ధైర్యం చేసి వ్యాఖ్యానించినట్టున్నారు. ఈ పదవి ఉంటే ఎంతో పోతే ఎంత అనుకున్నారో ఏమో గాని ఆయన మంచి మాటే చెప్పారు. అలా అని ఎక్కడా పొరపాటు, విమర్శ చేయలేదు. 

పీవీ రమేష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. కోవిడ్ విషయంలో ఆయన ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉంటారు.