రంగంలోకి పి.వి.సింధును దించిన జగన్ 

June 03, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతికి కట్టడి వేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. తన మీద పడిన అవినీతి ముద్రను తొలగించుకోవడానికి జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆయన సంపద మొత్తం అవినీతి సంపాదన అని నిరూపించడానికి సీబీఐ తన ప్రయత్నం తాను చేస్తోంది. 

తాజాగా అవినీతిపై పోరాటం కోసం ముఖ్యమంత్రి జగన్ పీవీ సింధు సాయం కోరారు. అవినీతి కంప్లయింట్ల కోసం ఏర్పాటుచేసిన  టోల్ ఫ్రీ నంబ‌ర్ 14400 గురించి  ప్ర‌చారం చేయడానికి పీవీ సింధును ప్రభుత్వం అంబాసిడర్ గా నియమించింది. ఈ మేరకు దానిపై ఓ వీడియోను కూడా రూపొందించింది.  ఏపీలో.. ఎవరు అవినీతికి పాల్పడినా, అవినీతి గురించి మీకు తెలిసినా నిర్భయంగా మీ గొంతు వినిపించండి. వెంటనే 14400 అనే టోల్‌ఫ్రీ నం బర్‌కు సమాచారమివ్వండి’’ అంటూ వీడియోలో సింధు పిలుపునిచ్చింది.

రాజకీయ అవినీతిని, పదవుల పంపకంలో బంధుప్రీతిని అడుగడుగునా ప్రదర్శిస్తున్న జగన్ ప్రభుత్వ శాఖల్లో మాత్రం ప్రతిఒక్కరు బంధుప్రీతికి, అవినీతికి దూరంగా ఉండమంటున్నారు. యథా రాజ తథా ప్రజ అంటారు. తన స్థాయిలో తాను నిక్కచ్చిగా ఉంటే... అధికారులు,  ప్రజలు ఆటోమేటిగ్గా మంచి మార్గంలో నడుస్తారు. మరి ఇది ఏపీలో జరిగేనా? జగన్ బంధుప్రీతి, కులప్రీతిని వదిలేసేనా?