నాని, వెంకన్న మధ్యలో పీవీపీ ఎంటరయ్యాడు

July 01, 2020

రాజకీయ పార్టీ అన్నాక అనేక మంది ఉంటారు. అందరూ ఒకేలా ఉండాలని, అందరూ అందరికీ నచ్చాలని లేదు. కొన్ని అసంతృప్తులు కామన్. కానీ అవి ఏ సమావేశాల్లోనో జరిగితే మీడియా ద్వారా రహస్యాలుగా బయటకు వచ్చేవి ఇంతకాలం. ఇలాంటివి కాంగ్రెస్లో బాగా ఎక్కువగా ఉండేవి. కానీ తాజాగా ఇద్దరు తెలుగుదేశం నేతలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని అందరి ముందు ఆన్లైన్లో బహిరంగంగా తిట్టుకున్నారు. ఎవరు ఏం తప్పులు చేశారో ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు. ప్రత్యర్థుల చేతికి ఆధారాలు ఇచ్చారు. ఈ వివాదంపై 24 గంటలు గడిచినా, పార్టీ పరువు బజారున పడినా అధిష్టానం స్పందించలేదు.
తాజాగా అందరూ ఊహించినట్లే రొట్టె ముక్క కోసం రెండు కాకులు కొట్టుకుంటే పిల్లి వచ్చి న్యాయం చెప్పి ఆ రొట్టె ముక్కను ఎత్తుకెళ్లినట్లు వైైసీపీ వాళ్లు ఇందులో ఎంటరయ్యారు. నిర్మాత, వైసీపీ నాయకుడు పొట్లూరి వర ప్రసాద్ నానికి, బుద్ధా వెంకన్నకు ఘాటు షాక్ ఇచ్చారు. మీలో మీరు కొట్టుకోవడమేనా ప్ర‌జ‌ల‌కు ఏమైనా చేసేది ఉందా? లేదా? మీరిద్ద‌రూ చేసుకున్న ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌జ‌లంతా ముక్త‌కంఠంతో ఏకీభ‌విస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పీవీపీ కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. ఇపుడు అతనికి ఆ కోపం పోగొట్టుకునే అవకాశం దొరికింది. అసలే పార్టీ లో కాన్ఫిెడన్స్ తో సతమతం అవుతుంటే... వీరిద్దరి పంచాయితీ పెద్ద రచ్చవుతోంది. వీరి గొడవపై మరికొందరు వైసీపీ నేతలు వ్యంగాస్త్రాలు వేసినా ఆశ్చర్యం లేదు.