మాస్క్ లేకపోతే 42 లక్షల ఫైన్ !

June 06, 2020

28 లక్షల జనాభా మాత్రమే ఉన్న ఖతార్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చిన్న దేశంలో 28 వేల కేసులు నమోదయ్యాయి. అంటే లక్షకు వెయ్యి మందికి కరోనా సోకింది. ఒక్క శాతం జనాభాకు కరోనా సోకింది. సోకిన వారిలో 14 శాతం మంది మరణించారు. దీంతో ఖతార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

మాస్కు పెట్టుకోకపోతే 2 లక్షల రియాల్ (1 రియాల్ -20.2 రూపాయలు) అంటే మన కరెన్సీలో 42 లక్షల రూపాయలు ఫైన్. కరోనా వల్ల విలవిల్లాడుతున్న ఖతార్ లో కేవలం నిర్మాణ రంగం తప్ప అన్నీ లాక్ డౌన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని కంట్రోల్ చేయడానికి ఆ దేశం కఠిన చర్యలు తీసుకుంటోంది.

అయితే, జరిమానాతో వదిలిపెట్టడం లేదు. మాస్కు లేనివారి నుంచి 42 లక్షలు వసూలు చేయడంతో పాటు మూడేళ్ల పాటు జైలుకు పంపనుంది. ఇందులో ఎటువంటి మినహాయింపు ఉండదని పేర్కొంది. 

ఖతార్ దేశంలో 67 శాతం ముస్లింలు, 14 శాతం హిందువులు, 14 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. అన్ని ప్రార్థనా స్థలాలు ప్రస్తుతం అక్కడ మూతపడ్డాయి.