రిలయన్స్ సుడి... తాజా వాటా అమ్మకం షాకింగ్

August 13, 2020

వడ్డించేవాడు మనవాడయితే చివర్న కూర్చున్నా వస్తుంది. గవర్నమెంటు మన మాట వినేదైతే అనుకున్నవన్నీ జరుగుతాయి. అందుకే అంబానీకి ​లాక్ డౌన్ కూడా వరమైంది. పెట్టుబడుల వరద రిలయన్స్ ఇండస్ట్రీని ముంచెత్తుతోంది. 

లక్ష కోట్ల అంబానీ పాత సంగతి... ఇపుడు అంబానీ ప్రపంచపు టాప్ 10 సంపన్నుడు. ఏంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఆయన పొజిషన్ మెరుగైందే గాని తరగలేదు.

ఫేస్ బుక్ యాజమాన్యంతో మొదలుకొని అంబానీ కంపెనీల్లో కోట్లాది పెట్టుబడులు తరలివచ్చాయి. తాజాగా క్వాల్ కామ్ 730 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టినట్టు ప్రకటించింది. ఇదేదో భారీ సొమ్ము అనుకునేరు. పిపీలికం. 730 కోట్లు పెడితే క్వాల్ కామ్ కి దక్కిన వాటా ఎంతో తెలుసా...

జస్ట్ 0.15 పర్సెంట్ (zero point one five) ...నిజమేనండీ. ఏ పర్సెంటేజీ తీసుకుని ఏం చేసుకుంటారు అనుకుంటున్నారా... మరంతే... ఆ లెక్కన మిగతా వాళ్లు ఎంత పెట్టుబడి పెట్టారు. వారికి ఎంత పర్సెంటేజీ గిట్టుబాటు అయ్యుంటుందని మీకు అనుమానం వచ్చింది కదా. 

ఇదిగో కింద ఆ లిస్టుంది. తీరిగ్గా చదువుకోండి.