ఎన్నారైలకు గుడ్ న్యూస్

August 05, 2020

కేంద్ర బడ్జెట్‌లో ఎన్ఆర్‌ఐలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎన్నారైలకు ఆధార్ తీసుకునే అవకాశం ఉన్నా అది క్లిష్టతరంగా ఉంది. దీనికోసం ఎన్నారైలు చాలా సమయం వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ఈ బడ్జెట్ లో ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం... భారత పాస్ పోర్టు ఉన్న ఎన్‌ఆర్ఐలు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఆధార్ కార్డు కావాలంటే కనీసం 180 రోజుల పాటు ఇండియాలో నివసించాల్సి ఉంటుంది. ఈ విధానంలో కేంద్రం మార్పులు తెచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం ఎన్ఆర్‌ఐలు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆధార్ కార్డు తీసుకోవచ్చు. అంటే, వెంటనే అప్పటికపుడు ఆధార్ కార్డు వస్తుందన్నమాట. 180 రోజులు నిబంధన తొలగించారు. దీంతో విదేశాల్లో చాలా రోజులుగా ఉంటున్న ఎన్ఆర్ఐలకు ఇది పెద్ద ఊరట కలిగించింది. అయితే, ఇండియన్ పాస్ పోర్టు కలిగి ఉంటేనే ఈ సదుపాయం లభిస్తుంది.