రాయ్ ల‌క్ష్మీ కి షాకిచ్చి అదాని గ్రూపు

May 29, 2020
CTYPE html>
ప్ర‌ముఖులైనా.. సామాన్యులైనా క‌ష్ట‌ప‌డిన సొమ్ము ఉత్త‌నే పోతుందంటే బాధే. తాజాగా అలాంటి బాధ‌నే వ్య‌క్తం చేస్తోంది కోలీవుడ్‌.. టాలీవుడ్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో త‌న అదృష్టాన్ని తెగ ప‌రీక్షించుకుంటున్న రాయ్ ల‌క్ష్మీ. మిగిలిన వుడ్డుల‌తో పోలిస్తే బాలీవుడ్ లో ఎంత‌కూ త‌న ముద్ర‌ను వేయ‌లేక‌పోతున్నాన‌న్న ఆవేద‌న‌లో ఉన్న ఆమెకు.. మూడు నెల‌ల నుంచి వ‌స్తున్న క‌రెంటు బిల్లులు భారీగా షాకిస్తున్నాయ‌ట‌. 
గ‌డిచిన కొన్ని నెల‌లుగా తాను క‌రెంటు బిల్లు ఎంత క‌డితే.. త‌ర్వాతి నెల‌లో అంత‌కు రెట్టింపు బిల్లు వ‌స్తున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. తాజాగా ట్విట్ట‌ర్ ఖాతా నుంచి ఆమె ఈ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. అంతేకాదు.. త‌న‌కు షాకిస్తున్న క‌రెంటు సంస్థ‌కు ఫోన్ చేద్దామ‌ని ఆదాని ఎల‌క్ట్రిసిటీ సంస్థ టోల్ ఫ్రీ నెంబ‌రుకు కాల్ చేస్తే.. అదెంత‌కూ క‌ల‌వ‌లేద‌న్న మ‌రో నిజాన్ని వెల్ల‌డించారు.
త‌న ప‌రిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగ‌తేమిటంటూ.. విష‌యాన్ని మ‌రింత విస్తృతం చేశారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ము ఇలా ఎవ‌రికో క‌ట్టాలంటే బాధ‌గా ఉందంటూ ట్విట్ట‌ర్ లో ట్వీట్ రూపంలో ఆమె పేర్కొన్నారు. తాను పే చేసిన బిల్లుకు రెట్టింపు బిల్లు త‌ర్వాతి నెల‌ల్లో వ‌స్తుంద‌ని.. గ‌డిచిన కొన్ని నెలలుగా ఈ విష‌యాన్ని గ‌మ‌నిస్తున్నాన‌ని.. టోల్ ఫ్రీ నెంబ‌రుకు ఫోన్ చేస్తే అస్స‌లు క‌ల‌వ‌ట్లేద‌న్న ఆమె.. త‌న మాదిరే చాలామంది ఇలా ఇబ్బంది ప‌డుతుంటార‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.
రాయ్ ల‌క్ష్మీ ట్వీట్ కు విద్యుత్ పంపిణీ సంస్థ ఆదానీ ఎల‌క్ట్రిసిటీ రియాక్ట్ అయ్యింది. ఆమెకు జ‌రిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని.. ద‌య‌చేసి వివ‌రాలు తెలియ‌జేస్తే ఇష్యూ క్లోజ్ చేస్తామ‌ని పేర్కొంది.  టోల్ ఫ్రీ నెంబ‌రు ప‌ని చేయ‌కున్నా.. దానికంటే ప‌వ‌ర్ పుల్ ట్వీట్ అన్న విష‌యం ఓకే అయినా.. సామాన్యుల ట్వీట్ల‌కు కూడా ఆదానీ ఎల‌క్ట్రిసిటీ ఇంతేలా రియాక్ట్ అవుతుందా? అన్న‌ది క్వ‌శ్చ‌న్.