హీరోయిన్ ’రాశి‘ గురించి దారుణమైన గాసిప్

August 04, 2020

అందాల రాసి.

ఈ పదానికి సార్థక నామధేయురాలు ఆనాటి ‘రాశి‘

ఈమె ‘సొగసుల‘కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. మీకేమైనా అనుమానం ఉంటే ఈ సీన్ చూసి తర్వాత వీడియో కింద మ్యాటర్ చదవండి. (వీడియో మధ్యలో ఎక్కడ క్లిక్ చేసిన ప్లే అవుతుంది) 

అది ‘రాశి’ అంటే...

ఇలాంటి ఎన్నో సీన్లతో కోట్ల మంది మగమహారాజుల కలలరాణిగా మారిన రాశి గురించి కొందరు అబద్ధాలు రాశారు. ఆ అబద్ధాలను దుష్ప్రచారం చేశారు ఇంకొందరు. ఇంతకీ ఏంటా అబద్ధం అంటారా...

రాశి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని, చితికిపోయిందని... చాలా కష్టాల్లో ఉందని ప్రచారం చేశారు. ఇది పీక్స్ కు వెళ్లడంతో రాశి స్వయంగా స్పందించారు. నాపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.  నాకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవు. కుటుంబంతో సంతోషంగా ఉన్నాను. ఇక సమస్యలు అంటారా... ఎవరికైనా వస్తుంటాయి, పోతుంటాయి... దాని గురించి బాధపడకూదు... అలా దాటుకుంటూ ముందుకు పోవాలి అని అన్నారు రాశి. 

చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న రాశి... ఇటీవల మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. తల్లిపాత్రలు కూడా వేస్తున్నారు. సౌత్ లో అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేశారు. బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించారు. ఎన్నో ప్రముఖ పాత్రలు పోషించిన రాశి.. 2006 - 2013 వరకు టాలీవుడ్ కు దూరంగా ఉన్నారు. 2013 నుంచి 2018 వరకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఎందులోను నటించలేదు. అందుకే ఈ పుకార్లు వచ్చి ఉంటాయి. కానీ రాశి మాత్రం తాను భేషుగ్గా ఉన్నాను అంటూ యుట్యూబ్ లో వీడియో పోస్ట్ చేసింది.