కోడలు జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మాజీ సీఎం

June 03, 2020
CTYPE html>
పెద్దింటి విషయాలు పెద్దగా బయటకు రావు. వచ్చినా లోగుట్టుగా లీక్ అవుతుంటాయే తప్పించి.. బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ల దగ్గర.. మీడియా ఎదుట పంచాయితీలు లాంటివి కాస్త తక్కువే. అందుకు భిన్నమైన సీన్ తాజాగా బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. ఆర్జేడీ అధినేత సతీమణి కమ్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పైన ఆమె కోడలు ఐశ్వర్య సంచలన ఆరోపణలు చేశారు.
జట్టుపట్టుకొని కొట్టి.. ఇంట్లో నుంచి తనను ఇంట్లో నుంచి అత్త వెళ్లగొట్టినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. లాలూ.. రబ్రీదేవిల పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గతంలోనూ తన అత్త.. ఆడపడుచు తనను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఐశ్వర్య ఆరోపణలు చేశారు.
తాజాగా మరోసారి తనపై దాడి చేశారని పేర్కంటూ ఐశ్వర్య పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పాట్నా జిల్లా ఎస్పీ గరీమా మాలిక్ రంగంలోకి దిగి రబ్రీ దేవి మీద దాడి కేసును నమోదు చేశారు. ఐశ్వర్యను ఆసుపత్రికి తరలించి.. వైద్య చికిత్స చేయిస్తున్నారు. తన కుమార్తె పోలీసుల్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఆమె తండ్రి కమ్ ఎమ్మెల్యే అయిన చంద్రికా రాయ్ రబ్రీదేవి ఇంటికి వెళ్లారు.
తన భార్య ఐశ్వర్యతో తనకు విబేదాలు ఉన్నట్ులగా పేర్కొంటూ భర్త తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులు కోరుతూ 2018 నవంబరులో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు తన ప్రత్యర్థులు ఇలాంటి పనులు చేస్తుంటారని తేజ్ ప్రతాప్ ఆరోపిస్తున్నారు.