చంద్రబాబుది దిక్కుమాలిన ఆరాటం : రాధాకృష్ణ షాకింగ్ కామెంట్స్

February 22, 2020

ప్రతి వారం తెలుగు రాష్ట్రాల పరిణామాలపై, అపుడపుడు జాతీయ పరిణామాలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రత్యేక విశ్లేషణలు రాస్తుంటారు. ఇవి చంద్రబాబుకు అనుకూలంగా చేస్తుంటారని వైసీపీ, టీఆర్ఎస్ అభిమానులు ఆరోపిస్తుంటారు. కానీ ఇదే విశ్లేషణల్లో రాధాకృష్ణ చంద్రబాబును అనేక సార్లు తూలనాడారు. విమర్శలు చేశారు. ఎన్నికల ముందు కూడా కొన్ని సార్లు గట్టిగానే అనేశారు. జగన్, కేసీఆర్ లతో పోలిస్తే ఒకట్రెండు సార్లు తక్కువ విమర్శలు చేసి ఉండొచ్చేమో గాని... విమర్శలు చేసినపుడు మాత్రం చంద్రబాబుపై, తెలుగుదేశంపై రాధాకృష్ణ గట్టి విమర్శలే చేస్తారు. 

అయితే, తాజాగా తెలుగుదేశం వారే షాక్ తినేటువంటి మాటలతో చంద్రబాబును విమర్శించారు రాధాకృష్ణ. ఇది శనివారం రాత్రి ముందుగా ఏబీఎన్ లో ప్రసారమైంది. ఇందులో అమరావతి కట్టడాల్లో చంద్రబాబుది దిక్కుమాలిన ఆరాటం అంటూ విమర్శించారు ఆర్కే. చరిత్రలో నిలిచిపోయే, కనువిందు చేసే భవనాలు కట్టాలన్న ఆరాటం, తాపత్రయంతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కోసం కట్టిన మంచి భవనాలను కూడా తానే తాత్కాలికం అని చెప్పుకుంటూ రావడం వల్లో జగన్ కి చంద్రబాబు స్వయంగా ఆయుధం ఇచ్చారన్నది ఆర్కే విశ్లేషణ. ఇంకొంచెం లుక్స్ తో నేరుగా అవే శాశ్వత భవనాలు అని చెప్పి కట్టి ఉంటే... అమరావతి గురించి ఆలోచించడానికే జగన్ భయపడేవాడని అంటున్నారు ఆర్కే. అమరావతి మార్పు చంద్రబాబు జగన్ అంశాలపై ఆర్కే మాటలను నేరుగా వినండి. కింద వీడియో ఇవ్వబడింది.