రాధేశ్యామ్: ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేసిందిగా

August 06, 2020

Radheshyam Movie details : రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. 

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన గంటల్లోనే ట్రెండింగ్ లో లక్షల్లోకి దూసుకెళ్లింది.

బాహుబలి, సాహో వంటి జాతీయ సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగింది.దీంతో దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోను ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టరు రిలీజ్ చేశారు.

రాధేశ్యామ్ లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఫస్ట్ లుక్ రిలీజ్ కి నిర్మాతలు మంచి టైమింగ్ ఎంచుకున్నారు. బాహుబలి .. ఫస్ట్ పార్ట్ రిలీజై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ... దీనిని రిలీజ్ చేయడంతో బాహుబలి క్రేజ్ ను కూడా దీనికి వాడుకున్నట్లుయ్యింది. 

రాధేశ్యామ్ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్, పూజా హెగ్డే‌లు దగ్గరగా ‌చాలా రొమాంటిక్‌గా ఉన్నట్టు పోస్టరు రిలీజ్ చేశారు. రొమాంటిక్ లవ్ స్టోరీ అని సింబాలిక్ గా పోస్టరు రిలీజ్ చేశారు. 

‘జిల్‘ ఫేమ్ రాధా కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఫస్ట్ లుక్ రిలీజయ్యాక సినిమాపై మరింత హోప్స్ పెరిగాయి.