రఘురామరాజు ప్రత్యక్ష యుద్ధం స్టార్ట్ !!

August 11, 2020

రఘురామరాజు వైసీపీకి విధేయత చూపారు. పార్టీని ఇష్టపడ్డారు.

వైసీపీ పార్టీ అధినేత జగన్ ను ఎంతగానో గౌరవించారు. ప్రభుత్వానికి నష్టం జరిగేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే... పార్టీ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు.

అంటే తప్పు చేసినా పొగడకుండా ప్రభుత్వాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. పార్టీ పట్ల విధేయత చూపారు. కానీ జగన్ ఇగో దెబ్బతింది. 

నువ్వు నాకు చెప్పేటోడివా అంటూ జగన్ ఆయన తీరుపట్ల ఆగ్రహం వ్యక్తంచేశారట.

ఆయన పలుమార్లు కోరినా అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారట.

అయినా రఘురామరాజు జగన్ ను ఇష్టపడ్డారు. పార్టీని ప్రభుత్వాన్ని కలిపి చూడొద్దంటూ పదేపదే మొత్తుకున్నా పార్టీ వినకపోగా అకారణంగా ఆయన పదవి పీకేయాలంటూ లోక్ సభ స్పీకరుకు పార్టీ కంప్లయింట్ ఇవ్వడం రఘురామరాజును నొప్పించింది. 

ఇదంతా ఒకెత్తు అయితే... పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా ఆయనను తిట్టారు. కార్యకర్తలు దేశ విదేవాలనుంచి ఫోన్ చేసి ఆయనను బూతులు తిట్టారు.

దీంతో తనకు రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర పోలీసు బలగాలతో రక్షణ కల్పించాలని రఘురామరాజు విన్నవించారు. దీనిపై హైకోర్టుకు కెళ్లారు.

దానిని వెంటనే పరిష్కరించాలని కేంద్ర హోంశాఖకు ఢిల్లీ హైకోర్టు సూచించింది.

ఇదిలా ఉండగా... రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించే రాజధాని విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం తప్పుడు విధానంలో వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పలువిషయాలపై ఫిర్యాదు చేయడానికి రఘురామకృష్ణంరాజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ని కలిశారు.  

భద్రత అంశంలో రాష్ట్రపతి రామ్‍నాథ్‍కు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనకు రక్షణ లేదని, తనకు కేంద్రం నుంచి రక్షణ కావాలని ఫిర్యాదు చేశారు.

రాజధాని అమరావతి విషయంలోను, హైకోర్టు తరలింపు విషయంపైనా ఆయన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.