రాజుగారి కొత్త లేఖ... జగన్ కి పిచ్చెక్కిస్తున్నాడే

August 12, 2020

జగన్ లేటెస్ట్  సవాల్ కరోనా కాదు, నిమ్మగడ్డ రమేష్ కాదు, చంద్రబాబు కాదు... రఘురామకృష్ణంరాజు. అతనిపై పైచేయి సాధిస్తే తప్ప జగన్ కు నిద్ర పట్టదు. కానీ ప్రతిసారి అతనే పైచేయి సాధిస్తున్నారు. గల్లీలో భారీ బలం లేకపోయినా ఢిల్లీలో ఉన్న బలంతో చెలరేగిపోతున్నారు.

తాజాగా జగన్ కు ఆయన మరో ట్విస్ట్ ఇచ్చాడు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి మరో లేఖ రాసిన రఘురామరాజు మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు. ఈరోజు అల్లూరు సీతారామరాజు పుట్టిన రోజు. భారతదేశం గర్వించదగ్గ పోరాటయోధుడు అల్లూరి. గతంలో పాదయాత్రలో కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరుపెడతా అని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని రఘురామరాజు జగన్ కు గుర్తుచేశారు.

కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని రఘురామ కృష్ణంరాజు జగన్ కు రాసిన లేఖలో కోరారు. పాదయాత్ర సమయంలో ఈ హామీని మీరు ప్రజలకు ఇచ్చారని, జిల్లాకు ఆయన పేరు పెడితే అల్లూరి సీతారామ రాజుకు గౌరవం ఇచ్చినట్లవుతుందని రఘురామకృష‌్ణంరాజు లేఖలో అభిప్రాయపడ్డారు.