జగన్ ని ఇరిటేట్ చేస్తున్న RRR

August 05, 2020

ఏపీ ముఖ్యమంత్రికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఒకదాని తర్వాత ఒకటి లేఖలు రాస్తున్నారు.  ఇప్పటికే అమరావతి రైతుల కోసం ఒకటి, అల్లూరి సీతారామరాజు పేరు కొత్త జిల్లాకు పెట్టాలని ఒకటి లేఖలు రాశారు. విచిత్రంగా... మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరుతోజిల్లా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మరో లేఖ రాశారు రఘురామకృష్ణరాజు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారు. కానీ 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని జీఓ విడుదల చేశారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రమే దానిని అమలు చేస్తున్నారు

దీనివల్ల లబ్దిదారులు అర్హులైన లబ్ధిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారు. వారికి ఆ మొత్తం ఆదేశాలు ఇవ్వాలని లేఖలో రఘురామరాజు కోరారు. అలాగే ప్రతి ఏడాది రూ.250 పెంచుతామని చెప్పిన పెన్షన్ కూడా వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని కోరారు.

మొత్తానికి ముఖ్యమంత్రి ఏం చేయాలో తన ఆఫీసు నుంచి కార్యక్రమాలు రూపొందిస్తూ జగన్ ను ఇరిటేట్ చేస్తున్నారు నరసాపురం రాజుగారు.