జగన్ కి రాజు లేఖ అందింది... క్రిస్టియానిటీ ప్రస్తావన

August 05, 2020

ముందు చెప్పిన ముహూర్తానికే ​సిఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.  సీఎం జగన్ కు ఆరుపేజీల లేఖలో  రఘురామ కృష్ణంరాజు  తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధార ఆరోపణలేనని సవివరంగా చెప్పారు. ఇపుడు ఈ లేఖ వైరల్ అవుతోంది. ఆయన ఏ పాయింట్ చుట్టు తిరుగుతూ ఉన్నారో అదే పాయింట్ మీదున్నారు ఈ  లేఖలో కూడా. 6 పేజీలు లేఖ రాసి అందులో అప్పాయింట్మెంట్ కూడా కోరారు. 

ఇక ఈ లేఖతో జగన్ కి పిచ్చెక్కించారనే చెప్పాలి రాజుగారు. ఎందుకంటే ఒకవైపు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రాజ్యంలో తనకు రక్షణ లేదంటాడు. కేంద్ర రక్షణ కావాలని హోంమంత్రిని కలుస్తాడు. వీటితో దేశవ్యాప్తంగా జగన్ పరువు తీసి నాకు మీరు దేవుడు, మీ పార్టీలోనే ఉంటాను అంటున్నాడు. అసలు రఘురాముడిని ఎలా డీల్ చేయాలో తెలియక జగన్ పరివారానికి పిచ్చెక్కిపోతోంది. 

మీ అంత గొప్ప సీఎం లేరని ఆ లేఖలో పొగడం కొసమెరుపు అయితే... సాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రిప్లైగా జగన్ కి లేఖ రాయడం గమనార్హం. సాయిరెడ్డి ఆధిపత్యాన్ని భరించడానికి ఒక్క క్షణం కూాడా రాజు సిద్ధంగా లేరు. జగన్ సెంట్రల్లో సాయిరెడ్డి మాట వినండని చెప్పినా వినకుండా దిక్కరించిన రాజును ఏమీ చేయకపోతే పార్టీలో తిరుగుబాట్లు పెరుగుతాయి. ఏమైనా చేద్దామంటే ఆయన వెనుక బీజేపీ పెద్ద ప్లాన్ తో ఉందని భయం. మరి జగన్ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

ఇక రఘురామరామ రాజు లేఖలో అన్ని విషయాలు ప్రస్తావించారు. తితిదే భూముల అమ్మకం, తన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేల తీరు, దిష్టిబొమ్మలు తగలబెట్టడం, అప్పాయింట్మెంట్లను కోటరీ డిసైడ్ చేయడం, పార్టీ అభిమానులు బెదిరింపు కాల్స్ చేయడం, కేంద్రంలో పెద్దలను కలవడం,  గృహ నిర్మాణ రంగ స్కాములు, టీవీ ఛానెళ్ల డిబేట్లు తదితర అంశాలు ప్రస్తావించారు.

తనకు ఏ రాజకీయ దురుద్దేశాలు లేవని, పార్టీలోనే ఉంటానని... నన్ను బయటకు పంపించే ప్రయత్నాలు ఆపేలా నేతలను దిశా నిర్దేశం చేయలని ఇలాంటివన్నీ ప్రస్తావించారు రాజుగారు. మరి జగన్ రిప్లై ఇస్తాడా? సస్పెండ్ చేస్తాడా? చూడాలి.