రఘురామరాజు వాడిన ఆ డైలాగ్ తో వైసీపీ చచ్చిపోయింది

August 08, 2020

రఘురామరాజు గురించి కొత్తగా చెప్పేదేముంది. ఏపీ రాజధాని ఏది అని అడిగితే ఏం చెబితే ఏం గొడవ వస్తుందో అనుకునే పరిస్థితిలోనే ఇంతకాలం ఉన్నారు.

రఘురాముడి దయ వల్ల... మీ పార్టీ ఏది అన్నా కూడా ఏం చెప్పాలో తెలియని కొత్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ అని చెప్పలేరు

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేరు.

షోకాజ్ నోటీసు ఇచ్చాక తీసుకున్న వారు వణకాల్సింది పోయి ఇచ్చిన వ్యక్తులనే వణికిస్తున్నాడు రఘురామరామజు.

ఇలాంటి వాడు ఆ పార్టీలో నెవర్ బిఫోర్, ఎవరాఫ్టర్. ఇప్పటికే రఘురామరాజు వేసిన అడుగులతో కుంగికుశించి ఏమనాలో తెలియక నరకం చూస్తున్న ఆ పార్టీకి రఘురామ రాజు తన అమ్ములపొదిలోంచి మరోబాణం వేశాడు. దానికి విలవిలా కొట్టుకుంటున్నారు.

తాజాగా ఆయన మోడీకి లేఖ రాశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పొడిగింపుపై కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాశారు.

దూరదృష్టితో తీసుకున్న పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు, దిగువ మధ్యతరగతికి మేలు కలుగుతుందని ఆకాంక్షించారు.

మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుంది అంటూ రఘురామ కృష్ణంరాజు లేఖలో కొనియాడారు.  

ఇపుడు ఈ డైలాగ్ ఓ రేంజ్ లో పేలింది. అసలు మోడీని ఇంతవరకు ఎంతో మంది పొగిడారు కానీ ఇంత సూటిగా, మళ్లీ మళ్లీ మీడియాలో పదేపదే ప్రస్తావనకు వచ్చే ఒక అద్భుతమైన ఈ వాక్యం బీజేపీ వారు కూడా ఇంతవరకు వాడలేదు.

ఈ ఒక్క లైనుతో అసలు రఘురామ రాజు మనసులో బీజేపీ ఎంత పాతుకుపోయిందో అర్థమైపోతుంది. నరనరాన మోడీ పాలసీలను, బీజేపీని జీర్ణించుకుంటే తప్ప... ఇలాంటి వాక్యం నోటి నుంచి బయటకు రాదు. 

రఘురామరాజు లేఖతో వైసీపీ నేతలు ఖిన్నులయ్యారు. మొహాల్లో రక్తపుచుక్కలేదు. అసలు ఇతన్ని ఏం చేయాలో కూడా వారికి క్లారిటీ లేని పరిస్థితి.