వైరల్... జగన్ ని తిట్టిన వైసీపీ ఎంపీ

May 25, 2020

సోషల్ మీడియా ఈజ్ కింగ్... ఎవరి తోక అయినా ఇట్టే కట్ చేయగలదు. ఎవరిని అయినా హీరోని చేయగలదు. ఎవరిని అయినా విలన్ ని చేయగలదు. దాని పుణ్యాన ఎవరు ఎపుడు ఫేమస్ అవుతారో ఎవరికీ తెలియదు. జగన్ ప్రెస్ మీట్ అనంతరం ఒకమ్మాయి జగన్ కరోనాపై కామెంట్ల గురించి ఒక వ్యంగ వీడియో వదిలితే 24 గంటల్లో ప్రపంచమంతటా తెలుగువారు చూశారు. ఆ అమ్మాయి తెగ ఫేమస్ అయ్యింది.  అందుకే... నేటి రాజకీయ నాయకులు దేనికి భయపడిన భయపడకపోయినా సోషల్ మీడియాకు మాత్రం భయపడక తప్పదు. 

తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక చోట మాట్లాడుతుండగా చుట్టూ ఉన్న క్యాడర్ జగన్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఏదో మీడియాతో మాట్లాడుతుంటూ ఈ అరుపులు ఏంటి అంటూ ఇరిటేట్ అయిన రఘురాముడు **ఎవడి నాయకత్వమయ్య, అవతలకి పో, బొచ్చులో నాయకత్వం, నోరుమూసుకుర్చొ** అంటూ అక్కడ నినాదాలు చేస్తున్న వారిపై కోప్పడ్డారు. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జగన్ గురించి ఆయన పేరు ఎత్తకుండా తిడుతుంటే వెనుక ఉన్న ఓ మహిళ తలొంచుుని నవ్వుతోంది. వాస్తవానికి ఇందులో పెద్ద ఉద్దేశాలేమీ కనపడటం లేదు. ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నపుడు డిస్టర్బ్ చేయడంతో రఘురామకృష్ణం రాజు వారిపై కోప్పడ్డారు.

అయితే, సాధారణంగా మిగతా 21 మంది ఎంపీలతో పోలిస్తే ఈయనకు జగన్ పట్ల లాయల్టీ ఉంది గాని పిచ్చి, భక్తి, తీవ్రమైన అభిమానం లేదు. ఓకే... ఆ పార్టీ ద్వారా గెలిచాం, పట్టించుకుంటే ఉంటాం, లేకపోతే పోతాం అన్నట్లే ఆయన వ్యవహారం ఉంటుంది. పైగా బీజేపీకి దగ్గరమనిషి కావడంతో జగన్ కూడా ఆయనని గట్టిగా ఏమీ అనలేకపోతున్నారు. కాకపోతే మరీ ఇంత మాట అనేసరికి వైరల్ అయిపోతోంది అది.