రఘురామరాజు తాజా పంచ్ - జగన్ ఫ్యాన్స్ హర్ట్

August 08, 2020

రఘురామరాజు ని ఎంత త్వరగా సస్పెండ్ చేస్తే యువజన శ్రామిక రైతు పార్టీకి అంత మంచిది. లేకపోతే ఆ పార్టీలో ఉన్నంత వరకు ఆయనను మీడియా పిలవడం ఆపదు.

పిలిచాక అడిగే ప్రశ్నల్లో ఆయన సొంత పార్టీని ఇరికించక మానడు.

దీనికంటే అతన్ని సస్పెండ్ చేస్తేనే కాస్త ప్రశాంతత ఉంటుందేమో.

అతను వేసే ఒక్కో బాణం ఎక్కడో గుచ్చుకుంటోంది.

 ఇటీవల ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ న్యూస్ యాంకర్... మీ మీద కేసులున్నాయట కదా. అందుకే బీజేపీలోకి పోవాలని చూస్తున్నారట కదా అంటూ ప్రశ్నించాడు.

దానికి ఆగ్రహించిన రాజు ఏందయ్యా కోటేసుకుని స్టూడియోలో కూసొని ఓ పనికమాలినవన్నీ అడుగుతావు.

నా మీద కేసు ఉంది. ఎవరో పెడితే ఉండేది కేసు. ఆ మాటకొస్తే నా కేసు గురించే నేనే ఎన్నికల అఫిడవిట్లో పెట్టాను. 

ఇంకా నయం నా మీద 1 కేసు మాత్రమే ఉంది. మా సీఎం మీద 26 కేసులు కేసులున్నాయి. మరేంటిపుడు? 

*కేసులు ఉన్నోల్లంతా బీజేపీలో చేరతారు అంటే ఈ పాటికి వైసీపీ మొత్తం బీజేపీలో ఉండాలని రాజు గారు చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

వైసీపీ మొత్తం కేసులు పార్టీయే అని తేల్చేశారు రఘురామ కృష్ణంరాజు. 

రాజు గారి ఆవేశానికి అడ్డంగా జగన్ బుక్కయ్యాడు. దీంతో జగన్ అభిమానులు మా అన్న పరువు ఎందుకు తీస్తావయ్యా? అంటూ వాపోతున్నారు.

మొన్నామధ్య ఒక ఎమ్మెల్యే కూడా ఇలాగే జగన్ పరువు తీశారు. అతను రాజుగారి గురించి మాట్లాడుతూ రాజుపై 420 కేసుంది, ఆయనో దొంగ అన్నారు.

అపుడు ఆ ఎమ్మెల్యేను కూడా క్యాడర్ తిట్టుకుంది. ఒరే నాయన అలా అనమాకు.... మన ముఖ్యమంత్రి పై కూడా 420 కేసు నడుస్తోంది.

ఆ కేసు ఉన్నోళ్లంతా దొంగ అయితే, మన సీఎంని తిట్టినట్టు అవుతుందని క్లాసు పీకారట.