నాపై కుట్ర జరిగింది ... రఘురామ కృష్ణంరాజు

August 13, 2020

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అందరూ ఎదురుతిరిగినా రఘురామరాజు జంకడం లేదు. వారికంటే మూడడుగులు ముందే ఉంటారు.

రఘురామరాజు మీదు వైసీపీ ఏం చేసినా అది ఆ పార్టీకి నష్టంచేస్తోంది గాని రఘురామరాజును ఏమీ చేయడం లేదు.

రోజురోజుకు రఘురామరాజు బలపడుతున్నారు. మరింత ప్రజాదరణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకే తిరిగి పాఠాలు నేర్పుతున్నారు.

ఏపీలో ఇసుక వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ ను తిట్టని ఏపీ పౌరుడే లేడు.

జగన్ చర్యల వల్ల హైదరాబాదు రియల్ ఎస్టేట్ పై కూడా ప్రభావం చూపింది.  

13 నెలలు గడిచినా ఇసుక సమస్యను జగన్ పరిష్కరించలేకపోతున్నారు.

పాలసీలో ఎన్ని మార్పులు చేసినా ఇసుక మాత్రం ఇప్పటికీ బ్లాక్ లో అయితేనే దొరుకుతుంది.

ఈ విషయంలో జనం పడుతున్న ఇబ్బందులు రఘురామరాజు ముఖ్యమంత్రికి మీడియా ద్వారా చెప్పారు.

అలాగే తిరుమల విషయంలో హిందు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా భూములు అమ్ముతున్నారని దానిని వ్యతిరేకించారు.

కానీ వైసీపీ అతన్ని పార్టీకి శత్రువులా చూస్తోంది. ఏకంగా అతనిపై అనర్హత పిటిషను లోక్ సభ స్పీకరుకు సమర్పించింది. దీనిపై రఘురామ కృష్ణంరాజు తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

వారి దృష్టంతా నా ఎంపీ పదవిపై కాదు, నా పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడగొట్టాలన్నదే లక్ష్యం అందుకే అలా చేస్తున్నారు.

నా మీద ఏదిపడితే అది మాట్లాడుతున్న వారు ఒక విషయం తెలుసుకోవాలి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ బాగా ఉంది. నేను పార్టీ గురించి మాట్లాడలేదు.

కేవలం ప్రభుత్వంలో కొన్ని లోపాల గురించి మనందరి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాను అన్నారు. 

నాకంటే ముందు ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత మాత్రమే నేను మాట్లాడాను.

ఆయన రెడ్డి కాబట్టి ఏమీఅనలేదు. నేను రెడ్డి కాదు కాబట్టి నన్ను టార్గెట్ చేశారేమో అన్న అనుమానాలు వ్యక్తంచేశారు.

పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలన్న తాపత్రయం తనది అని రఘురామరాజు క్లారిటీ ఇచ్చారు.