జగన్ కు ట్విస్ట్ ఇచ్చిన రఘురామ రాజు 

August 07, 2020

జగన్  ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక పలు చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం తరఫున కొన్ని నిధులు అధికారికంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి జగన్ అభీష్టం ఒకలా ఉంటే... ఆయన పార్టీ తరఫున గెలిచిన రఘురామరాజు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

ఆగస్టు 5న అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కీలక ఘట్టానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో రఘురామరాజు భారీ ట్విస్ట్ ఇచ్చారు. తన మూడు నెలల జీతం అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. **అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గౌరవనీయులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నా వంతు ఉడతాభక్తిగా పార్లమెంట్ సభ్యునిగా నాకు వచ్చే మూడు నెలల జీతభత్యాలను Rs 3,96,000 (మూడు లక్షల తొంబై ఆరు వేలు రూపాయలు) శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు సమర్పిస్తున్నాను** అంటూ తన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.

ఒకవైపు జగన్ తిరుమల లడ్డుకు సబ్సిడీ తీసేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా దర్శనాలు ఆపడం లేదు. తిరుమల భూమల అమ్మకంపై టీటీడీ నిర్ణయం తీసుకుంటే వ్యతిరేక వచ్చాక గాని దానిని విరమించుకోలేదు. కానీ ఆయన పార్టీ తరఫున గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు​ హిందు ధర్మోద్దరణ కార్యక్రమానికి విరాళం ఇచ్చారు. మరి దీనిపై అధినేతలో అంతర్మథనం ఏం జరుగుతుందో మరి. ​